How to link EPF account to Aadhaar : ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?
How to link EPF account to Aadhaar : మీ ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలా? ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
How to link EPF account to Aadhaar : భారతీయులకు ఆధార్ కార్డు చాలా కీలకం. ఇది లేకపోతే దాదాపు ఏ పని కూడా జరగదు! ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్) అకౌంట్‌కు ఆధార్ నెంబర్‌ను లింక్ చేసుకోవడంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలేంటి? ఈపీఎఫ్‌కు ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
ప్రయోజనాలు..
ఈపీఎఫ్ఓలో ప్రస్తుతం 4కోట్ల మందికిపైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరు తమ ఈపీఎఫ్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. దీనితో కలిగే ప్రయోజనాలు చూద్దాము..
- అకౌంట్‌ను డూప్లికేట్ చేసే ముప్పు తగ్గుతుంది.
- వ్యక్తిగత వివరాల డేటాలో తప్పులు ఉండే అవకాశం తగ్గుతుంది
- పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభమవుతుంది.
ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేయడం ఎలా..?
ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి. అవి.. ఆన్లైన్, ఆఫ్‌లైన్
ఆన్లైన్ ప్రక్రియ..
స్టెప్ 1:- ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి. https://iwu.epfindia.gov.in/eKYC/ (ఇది ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్)
స్టెప్ 2:- మీ యూఏఎన్, దానికి అటాచ్ చేసిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
స్టెప్ 3:- సబ్మీట్ బటన్ ప్రెస్ చేస్తే.. మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
స్టెప్ 4:- ఓటీపీని ఎంటర్ చేయండి. జెండర్‌పై క్లిక్ చేయండి. మీ వివరాలు ఇవ్వండి.
స్టెప్ 5:- మీ ఆధార్ నెంబర్ టైప్ చేసి.. ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ఎంచుకోండి.
Link EPF account to Aadhaar : స్టెప్ 6:- 'యూజ్ మొబైల్ నెంబర్/ ఈమెయిల్ బేస్డ్ వెరిఫికేషన్' వంటి ఆప్షన్స్ వస్తాయి. వాటిల్లో ఒకటి ఎంచుకోండి.
స్టెప్ 7:- మీకు ఓటీపీ వస్తుంది. అది టైప్ చేసి ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఇదీ చూడండి:- How to link Aadhaar to LPG : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్‌ను లింక్ చేయండి ఇలా..
ఉమంగ్ యాప్..
స్టెప్ 1:- ఉమంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసి సర్వీసెస్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2:- ఆల్ సర్వీసెస్ ట్యాబ్‌లో ఈపీఎఫ్ఓపై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ఈకేవైసీ సర్వీసెస్‌పై క్లిక్ చేసి, ఆధార్ సీడింగ్ ఆప్షన్ ఎంచుకోండి.
EPF account Aadhaar link : స్టెప్ 4:- యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. లాగిన్ అవ్వండి.
స్టెప్ 5:- మీ ఆధార్ రిజిస్టర్డ్ నెంబర్‌కు మరో ఓటీపీ వస్తుంది.
స్టెప్ 6:- ఆ ఓటీపీని వెరిఫై చేయండి. మీ ఆధార్ నెంబర్.. ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయిపోతుంది!
ఆఫ్‌లైన్ మోడల్..
ఆఫ్‌లైన్‌లో మోడ్‌లో ఈపీఎఫ్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌కు లింక్ చేయాలంటే.. స్థానిక ఈపీఎఫ్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ సీడింగ్ అప్లికేషన్‌ను ఫిల్ చేసి, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆ ఫామ్‌ను ఎగ్జిక్యూటివ్‌కు ఇవ్వాలి. వెరిఫికేషన్ అనంతరం ఆధార్ నెంబర్ మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ అవుతుంది.
సంబంధిత కథనం