How to buy SGB: 2023-24 లో మూడో విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ విడుదల అయ్యాయి. ఇవి బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, స్టాక్ ఎక్స్చేంజీల్లో డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, స్టాక్ ఎక్స్చేంజీల్లో కొనుగోలు చేయవచ్చు.
మూడో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond) ధర ను ఒక గ్రాముకు రూ. 6,199 గా నిర్ణయించారు. భద్రత సహా వివిధ కారణాల వల్ల ఫిజికల్ గా బంగారం కొనుగోలు చేయలేని వారికి, బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం మంచి అవకాశం. దీనితో రెగ్యులర్ వడ్డీ తో పాటు, బంగారం ధర పెరుగుదలతో అదనపు లాభం కూడా వస్తుంది. ఈ బాండ్ తో 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. వడ్డీని ప్రతీ 6 నెలలకు ఒకసారి జమ చేస్తారు.
అర్హులైన ఇన్వెస్టర్లకు డిసెంబర్ 28వ తేదీన ఈ బాండ్ల (Sovereign Gold Bond) ను ఇష్యూ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఈ బాండ్స్ ను ఇష్యూ చేస్తుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ను ఒక్కొక్కరు 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్ట్ లు 20 కేజీల వరకు సబ్ స్క్రైబ్ చేయవచ్చు. ఈ ఎస్జీబీ కాలపరిమితి 8 ఏళ్లు. ఐదేళ్ల తరువాత కావాలనుకుంటే రిడీమ్ చేసుకోవచ్చు.
సావరిన్ గోల్డ్ బాండ్స్ ను వివిధ మార్గాల్లో కొనుగోలు చేయవచ్చు. ఇంట్లోనే కూర్చుని ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా (How to buy Sovereign Gold Bond) కొనుగోలు చేయవచ్చు.
1) బ్యాంకుల నుంచి కూడా ఈ బాండ్లను కూడా కొనుగోలు చేయవచ్చు.
2) నెట్ బ్యాంకింగ్ ద్వారా SGB లను కొనవచ్చు.
3) మీ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా కూడా కొనవచ్చు.
4) నేరుగా ఏదైనా పోస్టాఫీసుకు, లేదా ఏదైనా బ్యాంక్ కు వెళ్లి కూడా ఈ ఎస్జీబీలను కొనుగోలు చేయవచ్చు. డబ్బు చెల్లింపు చేయడానికి చెక్కు లేదా DD అవసరం ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ కూడా జత చేయండి.
5) RBI రిటైల్ డైరెక్ట్ వెబ్‌సైట్ ద్వారా కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్ ను కొనవచ్చు.
6) స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL) నుంచి కూడా బంగారం బాండ్లను కూడా కొనుగోలు చేయవచ్చు.
7) గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కూడా ఈ బంగారం బాండ్లను కూడా కొనుగోలు చేయవచ్చు.