Honda Upcoming SUV: హోండా నుంచి త్వరలో రానున్న ఎస్‍యూవీ పేరు ఇదే! మరిన్ని వివరాలు
Honda Upcoming SUV: హోండా నుంచి త్వరలో భారత మార్కెట్‍లోకి రానున్న కాంపాక్ట్ ఎస్‍యూవీ పేరు బయటికి వచ్చింది. అలాగే మరిన్ని అంచనాలు కూడా వెల్లడయ్యాయి. ఆ వివరాలు ఇవే.
Honda Upcoming SUV: హోండా కార్స్ ఇండియా (Honda Cars India) సంస్థ.. చాలా సంవత్సరాల తర్వాత భారత మార్కెట్‍లో కాంపాక్ట్ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. షార్ప్ లుక్‍తో రానున్న ఈ కారును హోండా ఇప్పటికే టీజ్ చేసింది. జూన్‍లో ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ భారత మార్కెట్‍లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, తాజాగా ఈ ఎస్‍యూవీ పేరు బయటికి వచ్చింది. 'ఎలెవేట్ (Elevate)' పేరుతో హోండా నయా ఎస్‍యూవీని తీసుకురానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే భారత మార్కెట్‍లో ఈ సరికొత్త హోండా ఎలెవేట్ కాంపాక్ట్ ఎస్‍యూవీ (Honda Elevate SUV) లాంచ్ కానుంది. వివరాలివే.
Honda Elevate SUV: ఎలెవేట్ పేరుతో తీసుకురావాలనుకుంటున్న ఎస్‍యూవీని కొంతకాలంగా హోండా టెస్ట్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో చాలాసార్లు ఈ కారు కనిపించింది. కొత్త జనరేషన్ సిటీ సెడాన్ ప్లాట్‍ఫామ్ బేస్‍గానే ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ హోండా ఎలెవేట్ రానుంది. ఆవిష్కరణ సమయంలో ఈ పేరును హోండా అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉంది.
Honda Elevate SUV: గ్లోబల్ మార్కెట్‍లో ఉన్న సీఆర్-వీ మోడల్‍ను పోలిన డిజైన్‍తో హోండా ఎలెవేట్ ఎస్‍యూవీ వస్తుందని అంచనాలు ఉన్నాయి. తదుపరి తీసుకురానున్న ఎస్‍యూవీ స్కెచెస్‍ను కూడా హోండా ఇటీవల టీజ్ చేసింది. ఫ్రంట్‍లో స్లిమ్, షార్ప్ ఎల్‍ఈడీ హెడ్‍లైట్ యూనిట్, పెద్ద గ్రిల్‍తో ఇది రానుంది. కాగా, టెస్టింగ్ జరిగిన సమయంలో తీసిన కొన్ని స్పై షాట్లకు చెందిన ఫొటోలు కూడా ఆన్‍లైన్‍లో చక్కర్లు కొడుతున్నాయి. కనీసం 16 ఇంచులకు తగ్గని మల్టిపుల్ స్పోక్ అలాయ్ వీల్‍లతో Honda Elevate SUV రానుంది.
Honda Elevate SUV: హోండా ఎలెవేట్ ఎస్‍యూవీ ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‍మెంట్ యూనిట్ కోసం పెద్ద టచ్ డిస్‍ప్లే ఉంటుందని తెలుస్తోంది. అలాగే డ్రైవర్ డిస్‍ప్లే కూడా డిజిటల్‍గా ఉండనుంది.
Honda Elevate SUV: 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‍తో హోండా ఎలివేట్ ఎస్‍యూవీ వచ్చే అవకాశం ఉంది. నయా జనరేషన్ హోండా సిటీలోని 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ యూనిట్‍నే ఇది పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇంజిన్ 110 bhp పవర్ వరకు ప్రొడ్యూజ్ చేయగలదని అంచనాలు ఉన్నాయి.
హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టొయోా అర్బన్ క్రూజ్ హైరైడర్ సహా ఈ సెగ్మెంట్‍లోని కంపాక్ట్ ఎస్‍యూవీలకు Honda Elevate పోటీగా నిలువనుంది.
ఎలెవేట్ ఎస్‍యూవీకి హోండా విభిన్నమైన వేరియంట్లను తీసుకురానుంది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను టాప్ వేరియంట్లకు ఇచ్చే ఛాన్స్ ఉంది. హైబ్రిడ్ ఆప్షన్‍ను కూడా తీసుకొస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
టాపిక్