Honda CB350 Cafe Racer: హోండా సీబీ350 లైనప్‍లో కొత్త మోడల్.. ధర ఎంత ఉండొచ్చంటే!-honda motorcycle set to bring honda cb350 cafe racer bike to indian market very soon know the details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Cb350 Cafe Racer: హోండా సీబీ350 లైనప్‍లో కొత్త మోడల్.. ధర ఎంత ఉండొచ్చంటే!

Honda CB350 Cafe Racer: హోండా సీబీ350 లైనప్‍లో కొత్త మోడల్.. ధర ఎంత ఉండొచ్చంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 26, 2023 11:05 AM IST

Honda CB350 Cafe Racer: హెండా సీబీ350 కేఫ్ రేసర్ బైక్ ఇండియా మార్కెట్‍లోకి అతిత్వరలో రానుంది. స్టాండర్డ్ సీబీ350తో పోలిస్తే డిజైన్ మార్పులతో ఈ నయా మోడల్ అడుగుపెట్టనుంది.

హోండా సీబీ350ఆర్ఎస్ (ప్రతీకాత్మక చిత్రం)
హోండా సీబీ350ఆర్ఎస్ (ప్రతీకాత్మక చిత్రం) (HT Auto)

Honda CB350 Cafe Racer: సీబీ350 రేంజ్‍లో కొత్త మోడల్‍ను తీసుకొచ్చేందుకు హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా (HMSI) రెడీ అయింది. హోండా సీబీ350 కేఫ్ రేసర్ (Honda CB350 Cafe Racer) బైక్‍ను ఆ కంపెనీ అతిత్వరలో లాంచ్ చేయనుంది. హెచ్‍నెస్, ఆర్ఎస్ వెర్షన్‍ల తర్వాత ఈ లైనప్‍లో ఈ కేఫ్ రేసర్‌ను హోండా తీసుకొస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇప్పటికే కొన్ని ఫొటోలు లీకయ్యాయి. మార్చి 2వ తేదీన ఈ నయా మోడల్‍ లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. వివరాలివే..

ఈ మార్పులతో..!

Honda CB350 Cafe Racer: డీలర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఓ ఈవెంట్‍లో ఇటీవల ఈ సీబీ350 కేఫ్‍ రేసర్ బైక్‍ను హోండా ప్రదర్శించింది. దీంతో అతిత్వరలో లాంచ్ తథ్యమైందని తెలుస్తోంది. ఇంజిన్ సహా మెకానికల్స్ విషయానికి వస్తే స్టాండర్డ్ సీబీ350నే పోలి ఉంటుంది ఈ కేఫ్ రేసర్. కాకపోతే డిజైన్‍లో కొన్ని మార్పులు ఉంటాయి. ముఖ్యంగా హెడ్‍ల్యాంప్ కౌల్ కొత్త లుక్‍ను కలిగి ఉంటుంది. సింగిల్ పీస్ లెదర్ సీట్‍లోనూ మార్పు ఉంటుంది. కేఫ్ రేసర్ లుక్ ఉండేలా సీటు చివర్లో ఓ కౌల్ (Cowl)‍ను హోండా పొందుపరచనుంది.

Honda CB350 Cafe Racer హ్యాండిల్ బార్, ఫ్లుయెల్ ట్యాంక్ మరింత వెడల్పు ఉండే ఛాన్స్ ఉంది. క్రోమ్ ఫినిష్ ఎక్జాస్ట్, అలాయ్ వీల్స్, సెమీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, యూఎస్‍బీ చార్జర్ ఫీచర్లను ఈ Cafe Racer బైక్ కలిగి ఉండనుంది.

Honda CB350 Cafe Racer: ఇంజిన్ అదే..

హోండా సీబీ350 లైనప్‍లో స్టాండర్డ్‌గా ఉండే 348 cc ఇంజిన్‍తోనే ఈ కేఫ్ రేసర్ బైక్ కూడా రానుంది. అయితే సరికొత్త ఓబీజీ 2 ఎమిషన్ ప్రమాణాలను ఈ ఇంజిన్‍ కలిగి ఉంటుంది. 5,500 rpm వద్ద ఈ ఇంజిన్ 20.6 bhp పవర్, 3,000 rpm వద్ద 30 Nm పీక్ టార్క్యూను ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ గేర్ బాక్సునే ఈ కేఫ్ రైడర్ కూడా కలిగి ఉండనుంది.

Honda CB350 Cafe Racer: ఎల్ఈడీ లైటింగ్, సెమీ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్, డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్ సహా మరిన్ని ఫీచర్లతో హోండా సీబీ350 కేఫ్ రేసర్ రానుంది. టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక డ్యుయల్ షాక్స్ ఉంటాయి. అలాయ్ వీల్‍లకు డిస్క్ బ్రేక్‍లు కూడా కొనసాగుతాయి. లాంచ్ సమయంలో ఈ కేఫ్ రేసర్ గురించి పూర్తి వివరాలను హోండా వెల్లడిస్తుంది. మార్చిలో షోరూమ్‍లకు ఈ బైక్ చేరుకునే ఛాన్స్ ఉంది.

Honda CB350 Cafe Racer: అంచనా ధర

హోండా సీబీ350 కేఫ్ రేసర్ ప్రారంభ ధర రూ.2.1లక్షల నుంచి రూ.2.3లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనాలు ఉన్నాయి. లాంచ్ సమయంలో అధికారిక ధరను వెల్లడించనుంది హోండా.

Whats_app_banner

సంబంధిత కథనం