Honda Activa EV : మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్న హోండా యాక్టివా ఈవీ.. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ!
Honda Activa EV : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఈ స్కూటర్ రాకతో ఈవీ మార్కెట్ షేక్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
కొన్నేళ్లుగా దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. సైలెంట్‌గా మార్కెట్‌లో ఈవీలు దుమ్మురేపుతున్నాయి. చాలా కంపెనీలు తమ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను చేర్చుతున్నాయి. సాధారణ స్కూటర్లకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. ఓలా, ఏథర్ వంటి పెద్ద కంపెనీలు మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు చేస్తున్నాయి. అయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తే వీటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో హోండా, టీవీఎస్, సుజుకి కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 సమయంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు భారతీయ రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏమున్నాయో చూద్దాం..
హోండా యాక్టివా ఈవీ
హోండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మార్చి 2025లో వస్తుందని చెబుతున్నారు. ఇది యాక్టివా స్కూటీ ఎలక్ట్రిక్ వెర్షన్ అంటున్నారు. వేరు చేయగలిగే, మార్చగల బ్యాటరీ ప్యాక్‌తో ఇది రానుంది. జనవరిలో దిల్లీలో జరిగే గ్లోబల్ ఎక్స్‌పో 2025లో భారత్ మొబిలిటీ తన అరంగేట్రం చేస్తుందని అంచనా. హోండా యాక్టివా ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా డిజిటల్ టచ్ స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ స్టార్ట్/స్టాప్‌తోపాటుగా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.
సుజుకి బర్గ్‌మాన్ ఈవీ
దేశంలో సుజుకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బర్గ్‌మాన్ ఈవీ రానుంది. ఈ స్కూటర్‌ను రోడ్లపై పరీక్షిస్తున్నప్పుడు చాలాసార్లు కెమెరాలో కనిపించింది. జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. సుజుకి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఏటా 25,000 వాహనాలను మాత్రమే విక్రయించేలా ప్లాన్ చేస్తుంది.
టీవీఎస్ జూపిటర్ ఈవీ
టీవీఎస్ కంపెనీ ఇప్పటికే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. కొత్త జూపిటర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తోంది. వచ్చే 6 నెలల్లో భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. విడుదల తేదీ తెలియాలి. జూపిటర్ ఈవీ భారతదేశంలో కంపెనీ ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్. స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1 లక్షలోపే ఉండే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 70 నుంచి 80 కి.మీ రేంజ్ ఇవ్వొచ్చు.