HCL Tech Q3 results: క్యూ3లో 19 శాతం పెరిగిన హెచ్‌సీఎల్ లాభం-hcl tech q3 net profit rises 19 percent and declares interim dividend of 10 rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hcl Tech Q3 Results: క్యూ3లో 19 శాతం పెరిగిన హెచ్‌సీఎల్ లాభం

HCL Tech Q3 results: క్యూ3లో 19 శాతం పెరిగిన హెచ్‌సీఎల్ లాభం

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 05:56 PM IST

HCL Tech Q3 results: హెచ్‌సీఎల్ టెక్ ఏకీకృత నికర లాభంలో 19 శాతం పెరుగుదల నమోదైంది.

హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాల విడుదల
హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాల విడుదల

ఐటి సేవల దిగ్గజం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సిఎల్ టెక్) డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3ఎఫ్‌వై 23) ఏకీకృత నికర లాభం 19% పెరిగి రూ. 4,096 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికం (క్యూ3ఎఫ్‌వై22)లో ఇది రూ. 3,442 కోట్లుగా ఉంది.

క్రితం క్వార్టర్‌తో పోలిస్తే పన్ను తర్వాత లాభం (PAT) గత సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 3,489 కోట్ల నుంచి 17% పెరిగింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 22,331 కోట్ల నుంచి 19.5% పెరిగి రూ. 26,700 కోట్లకు చేరుకుంది.

ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ. 10 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. డిసెంబర్ 30, 2022 (Q3FY23)తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ 5,892 మంది ఫ్రెషర్‌లను తీసుకుంది. క్యూ 3లో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 222,270గా ఉంది.

గురువారం హెచ్‌సిఎల్ టెక్ స్క్రిప్ ఎన్‌ఎస్‌ఇలో 1.68% లాభంతో రూ. 1,072.50 వద్ద ముగిసింది. ఏడాది కాలంలో ఐటీ స్టాక్‌ 21 శాతానికి పైగా క్షీణించింది.

నోయిడాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐటీ సేవలు అందిస్తుంది.

Whats_app_banner