Laptop imports: ల్యాప్ టాప్ ల దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం-government restricts import of laptop computers tablets ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Laptop Imports: ల్యాప్ టాప్ ల దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

Laptop imports: ల్యాప్ టాప్ ల దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Aug 03, 2023 02:45 PM IST

Laptop imports:ల్యాప్ టాప్ ల దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. వాలిడ్ లైసెన్స్ లేకుండా వాటిని దిగుమతి చేసుకోవడం నిషేధమని తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Laptop imports:ల్యాప్ టాప్ ల దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాప్ టాప్ లు, టాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్లను దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించింది. సరైన లైసెన్స్ లేకుండా వాటిని దిగుమతి చేసుకోవడం నిషేధమని తెలిపింది. లైసెన్స్ ఉన్నవారు కూడా నిబంధనల మేరకు మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, పీసీ

హెచ్ఎస్ఎన్ 8741 (HSN 8741) కేటగిరీలోకి వచ్చే ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, పీసీలను ఇకపై సరైన లైసెన్స్ లేకుండా దిగుమతి చేసుకోవడం కుదరదు. నిబంధనల మేర దిగుమతి చేసుకోవడానికి కూడా వ్యాలిడ్ లైసెన్స్ అవసరం అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ ల దిగుమతికి ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది. ఈ కామర్స్ పోర్టల్స్ నుంచి కొనుగోలు చేసిన వాటికి నిర్ధారిత పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే,

వీటికి ఈ ఆంక్షలు వర్తించవు..

బ్యాగేజీ నిబంధనల ప్రకారం తీసుకువస్తున్న వాటిపై కూడా ఈ ఆంక్షలు వర్తించబోవు. ఒక కన్సైన్ మెంట్ లో 20 వరకు ఎలాంటి ఇంపోర్ట్ లైసెన్స్ లేకుండానే భారత్ కు తీసుకురావచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, రిపేర్ అండ్ రీ ఎక్స్ పోర్ట్.. తదితర అవసరాల కోసం ఇంపోర్ట్ చేసుకునే వాటికి కూడా ఈ ఆంక్షలు వర్తించవు. అయితే, వాటిని ముందు పేర్కొన్న అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వాటిని ఇతరులకు అమ్మకూడదు. అవసరం పూర్తయిన తరువాత వాటిని నాశనం చేయాలి. లేదా, మళ్లీ ఎగుమతి చేయాలి.

Whats_app_banner