Smart TV Discount : మిడిల్ క్లాస్‌కి కిక్కిచ్చే ఆఫర్లు.. డిస్కౌంట్‌ తర్వాత సగం ధరకే స్మార్ట్ టీవీలు-good news to middle class people branded smart tvs with bumper discounts during this festive season ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smart Tv Discount : మిడిల్ క్లాస్‌కి కిక్కిచ్చే ఆఫర్లు.. డిస్కౌంట్‌ తర్వాత సగం ధరకే స్మార్ట్ టీవీలు

Smart TV Discount : మిడిల్ క్లాస్‌కి కిక్కిచ్చే ఆఫర్లు.. డిస్కౌంట్‌ తర్వాత సగం ధరకే స్మార్ట్ టీవీలు

Anand Sai HT Telugu Published Oct 21, 2024 09:30 PM IST
Anand Sai HT Telugu
Published Oct 21, 2024 09:30 PM IST

Smart TV Discount : అమెజాన్ దీపావళి సేల్‌లో స్మార్ట్ టీవీల ధరలు సగానికి తగ్గాయి. ఎల్జీ, పానాసోనిక్, శాంసంగ్ వంటి బ్రాండ్లు స్మార్ట్ టీవీలపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నారు. మీరు కూడా స్మార్ట్ టీవీని పొందాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం.

స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్స్
స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్స్

సెప్టెంబర్ 27 న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ డిస్కౌంట్ డీల్స్ ఉన్నాయి. చాలా మంది దీపావళి సమయంలో ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటారు. మీ లిస్ట్‌లో స్మార్ట్ టీవీ ఉంటే డిస్కౌంట్స్‌తో పొందవచ్చు. 32 అంగుళాలు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలకు సంబంధించిన ఆ ఆఫర్స్ ఏంటో చూద్దాం..

ఎల్జీ 32 అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ బెస్ట్ సెల్లర్ బ్రాండ్‌గా మారింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ ఇన్ బిల్ట్ వంటి యాప్స్ ఉన్నాయి. దీని యాక్టివ్ హెచ్‌డీఆర్ పిక్చర్ క్వాలిటీని అద్భుతంగా చూపిస్తుంది. ఈ అమెజాన్ సేల్‌లో టీవీ ధరపై 37 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇన్ని ఫీచర్లతో ఉన్న ఈ టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది.

రెడ్ మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 56 శాతం తగ్గింపుగా ఉంది. రెడ్మీ నుండి ఈ 32 అంగుళాల స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ అమెజాన్ సేల్‌లో గొప్ప యూజర్ రేటింగ్‌ను పొందుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఈ టీవీ 10 వేల రేంజ్‌లో లభిస్తుంది. దీని ప్రత్యేక ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ టీవీ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, వాయిస్ కంట్రోల్ ఫీచర్, డాల్బీ ఆడియో, స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్‌ను కూడా పొందుతుంది.

48 శాతం తగ్గింపుతో ఏసర్ గూగుల్ టీవీ వస్తుంది. దీని ధర కేవలం రూ.12,999 మాత్రమే. ఇంత తక్కువ ధరకు ఈ టీవీ అమెజాన్ దీపావళి సేల్లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రత్యేక ఫీచర్లలో డాల్బీ ఆడియోతో పాటు గూగుల్ కాస్ట్, ఫాస్ట్కాస్ట్, మీటింగ్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. మీ వాయిస్ కమాండ్లతో పనిచేసే రిమోట్ సర్వీస్ కూడా ఇందులో ఉంది.

పెద్ద 55 అంగుళాల స్మార్ట్ టీవీని ఇంటికి కొనాలి అనుకుంటే మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సోనీ బ్రావియా గూగుల్ టీవీలో 42 శాతం డిస్కౌంట్‌తో వస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, సోనీ 55 అంగుళాల బ్రావియా 2 4కె అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ 4కె డిస్‌ప్లేతో వస్తుంది. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ వంటి ఫీచర్లు కూడా ఈ టీవీలో ఉన్నాయి.

వియు 55 అంగుళాల వైబ్ సిరీస్ క్యూఎల్ఈడీ 4కె గూగుల్ టీవీకి 37 శాతం డిస్కౌంట్‌ వస్తుంది. 88 వాట్ల సౌండ్ బార్, డాల్బీ ఆడియో సౌండ్, హెచ్‌డీఆర్ 10+ టెక్నాలజీ, 4కే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ ప్రత్యేక ఫీచర్లు. దీని ధరపై ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

షియోమీ 55 అంగుళాల ఎక్స్ సిరీస్ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ ధరలు 35 శాతం తగ్గింపుతో దొరుకుతుంది. షియోమీ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ వైఫై, స్క్రీన్ మిర్రరింగ్, గూగుల్ అసిస్టెంట్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్ స్టార్ వంటి ఓటీటీ యాప్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ సేల్‌లో కూడా ఈ టీవీకి మంచి యూజర్ రేటింగ్ వస్తోంది.

టీసీఎల్ స్మార్ట్ క్యూఎల్ఇడి గూగుల్ టీవీ కేవలం 36 వేల రూపాయలతో ఉంది. టీసీఎల్ ఈ స్మార్ట్ టీవీ మంచి క్వాలిటీతో వస్తుంది. ఈ టీసీఎల్ స్మార్ట్ టీవీ రిటైల్ మార్కెట్లో రూ.120990 ధరకు లభిస్తోంది. అంటే 69 శాతం డిస్కౌంట్‌తో ఇప్పుడు మీరు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో కేవలం రూ.36,990కే గొప్ప ఆఫర్‌తో ఇంటికి తీసుకురావచ్చు. ఇందులో మల్టిపుల్ ఐ కేర్ ఫీచర్ కూడా ఉంది.

Whats_app_banner