Gold and silver prices: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరల వివరాలు..-gold and silver prices today on 29 02 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today On 29-02-2024 : Check Latest Rates In Your City

Gold and silver prices: ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరల వివరాలు..

HT Telugu Desk HT Telugu
Feb 29, 2024 08:47 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు ఈ రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా పడ్డాయి. ఆ వివరాలు..

ఈ రోజు బంగారం, వెండి ధరలు
ఈ రోజు బంగారం, వెండి ధరలు

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం కూడా స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,580కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 57,590 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,75,800 కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,758గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 10 తగ్గి.. రూ. 62,820 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,830 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,28,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,282గా ఉంది.

ప్రధాన నగరాల్లో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,730 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,980 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,580 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,820 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,090గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,370 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,580 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,820 గాను ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,580 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,820 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,640గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,880 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,630 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,870 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,380 గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 73,800 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 73,900 గా ఉండేది.

Silver rates today : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 75,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,800.. బెంగళూరులో రూ. 71,300 గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గినవి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 180 తగ్గి.. రూ. 23,450 కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,630 గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 23,630 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel