Gold and Silver prices today : మరింత పడిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..-gold and silver prices today 27 august 2024 in hyderabad and other states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : మరింత పడిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Gold and Silver prices today : మరింత పడిన పసిడి, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..

Sharath Chitturi HT Telugu
Aug 27, 2024 05:37 AM IST

Gold and Silver prices today : దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి వెండి ధరలు..
మీ నగరాల్లో నేటి పసిడి వెండి ధరలు.. (REUTERS)

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు మంగళవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,940కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 66,950గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 6,69,400కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,694గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 73,030కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,040గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 7,30,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,303గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,090గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,180గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,940 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,030గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,940గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,030గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 69,990గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,080గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,940గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు మంగళవారం తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,780గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 87,800కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 87,900గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 92,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 87,800.. బెంగళూరులో రూ. 84,300గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు మంగళవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 తగ్గి.. రూ. 25,810కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,940గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,810గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం