Gold Rates Today: పసిడి ధర డౌన్, వెండిది మరోదారి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!-gold and silver price today november 23 latest rates in hyderabad delhi vijayawada know full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Rates Today: పసిడి ధర డౌన్, వెండిది మరోదారి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!

Gold Rates Today: పసిడి ధర డౌన్, వెండిది మరోదారి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 23, 2022 06:13 AM IST

Gold, Silver prices today: దేశీయ మార్కెట్‍లో నేడు బంగారం ధర కాస్త తగ్గింది. వెండి వెల పెరిగింది. ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates Today: పసిడి ధర డౌన్, వెండిది మరోదారి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..!
Gold Rates Today: పసిడి ధర డౌన్, వెండిది మరోదారి.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..! (HT_Photo)

Gold, Silver Rates Today: పసిడి కొనాలనుకునే వారికి తీపికబురు ఇది. దేశంలో నేడు (నవంబర్ 23) బంగారం ధర మరింత తగ్గింది. బులియన్ మార్కెట్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నేడు రూ.150 తగ్గి.. రూ.48,350కు చేరింది. గ్రాము వెల రూ.4,835గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన పసిడి కూడా కాస్త దిగొచ్చింది. రూ.170 మేర తగ్గి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750కు చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం నేడు కాస్త పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Today Gold Price in Hyderabad: హైదరాబాద్‍లో..

హైదరాబాద్ మార్కెట్‍లోనూ నేడు బంగారం ధర దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.48,350కు చేరింది. 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం వెల రూ.52,750గా ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంలోనూ ఇదే ధరలు ఉన్నాయి.

Gold Rate Today: దేశంలోని ఇతర సిటీల్లో..

దేశంలోని ఇతర నగరాల్లోనూ నేడు బంగారం ధర కిందికి వచ్చింది. నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,500కు దిగివచ్చింది. 24 క్యారెట్ల (10 గ్రాములు) గోల్డ్ వెల కూడా కాస్త తగ్గి రూ.52,900కు చేరింది. లక్నో, జైపూర్‍లోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక కోల్‍కతాలో 22 క్యారెట్ల (10 గ్రాములు) పడిసి ధర రూ.48,350గా, 24 క్యారెట్ల (10 గ్రాములు) రేట్ రూ.52,750గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళ, పుణెలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

అహ్మదాబాద్‍లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.48,400కు చేరింది. 24 క్యారెట్ల రేట్ రూ.52,800 వద్ద ఉంది. చెన్నైలో 22 గ్రాములకు చెందిన గోల్డ్ రేట్ రూ.49,050, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.53,510కి చేరింది.

అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మారుతుండటంతో బంగారం ధరల్లోనూ ఊగిసలాట కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‍లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1,742 డాలర్ల వద్ద ఉంది.

Silver Prices Today: నేటి వెండి ధరలు

బులియన్ మార్కెట్‍లో నేడు వెండి ధర స్వల్పంగా పెరిగింది. 1,000 గ్రాముల (కిలో) వెండిపై రూ.600 ధర అధికమైంది. దీంతో కిలో వెండి వెల రూ.61,200కు చేరింది. 10 గ్రాముల రేట్ రూ.612గా ఉంది.

హైదరాబాద్‍ మార్కెట్‍లో బుధవారం కేజీ వెండి ధర రూ.67,000గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, భువనేశ్వర్ లోనూ ఇదే ధర ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి వెల రూ.61,200గా ఉంది. ముంబై, కోల్‍కతా, పుణె, అహ్మదాబాద్‍లోనూ వెండి ధర ఇలానే ఉంది.

Platinum Prices Today: ప్లాటినం ధరలు

దేశీయ మార్కెట్‍లో ప్లాటినం ధరలు కూడా పెరిగాయి. 10 గ్రాముల ప్లాటినం రేట్ రూ.490 పెరిగి.. రూ.26,070కు చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే ధర ఉంది.

WhatsApp channel