Elon Musk Twitter : మస్క్ చేతికి ట్విట్టర్.. పరాగ్ అగర్వాల్‌పై వేటు!
Elon Musk takes control of Twitter : ఎలాన్ మస్క్.. ట్విట్టర్ డీల్ పూర్తయింది. ట్విట్టర్ మస్క్ చేతిలోకి వెళ్లింది. కాగా.. సీఈఓ పరాగ్ అగర్వాల్‌పై మస్క్ వేటు వేసినట్టు తెలుస్తోంది.
Elon Musk takes control of Twitter : దాదాపు 6 నెలల ఉత్కంఠకు తెరపడింది! అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ డీల్ పుర్తయింది. ట్విట్టర్‌ను మస్క్ తన సొంతం చేసుకున్నారు.
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న కొద్ది గంటల్లోనే.. సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను మస్క్ తొలగించినట్టు తెలుస్తోంది. పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరిపైనా టెస్లా సీఈఓ వేటు వేసినట్టు సమాచారం.
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్..
Elon Musk twitter :ఈ ఏడాది తొలినాళ్ల నుంచి ఈ వ్యవహారంపై ఊహాగానాలు జోరుగా సాగాయి. ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే మస్క్ ట్వీట్లు ఉండేవి. ట్విట్టర్లో భావ ప్రకటనా స్వేచ్ఛను పెంపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ట్విట్టర్ నిరాకరించలేని విధంగా ధరను ఆఫర్ చేశారు. ఇక మస్క్ చేతిలో ట్విట్టర్‌ని పెట్టేందుకు షేర్హోల్డర్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫలితంగా 44బిలియన్ డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు ఎలాన్ మస్క్.
అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో.. ట్విట్టర్ డీల్‌కు బ్రేక్ పడింది. ట్విట్టర్ చెప్పిన దానికన్నా.. సామాజిక మాధ్యమంలో బాట్ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వాటిని సీరియస్‌గా పరిగణించారు ఎలాన్ మస్క్. పూర్తి డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అందుకు ట్విట్టర్ ఒప్పుకోలేదు. డీల్‌పై చర్చల సమయంలోనే సమాచారం ఇచ్చామని చెప్పింది. ఆగ్రహంతో ట్విట్టర్ డీల్‌ను నిలిపివేశారు ఎలాన్ మస్క్.
Elon Musk twitter deal : ఆ తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ట్విట్టర్, ఎలాన్ మస్క్ మధ్య వివాదం నడిచింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్, మస్క్ విభేదాలు మొదలైనట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో.. శుక్రువారం లోపు ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని మస్క్‌కు డెడ్‌లైన్ ఇచ్చింది అక్కడి కోర్టు. అందుకు తగ్గట్టుగానే.. ట్విట్టర్‌తో డీల్‌ని పూర్తి చేశారు టెస్లా సీఈఓ. అంతకన్నా ముందు.. తన ట్విట్టర్ బయోను 'చీఫ్ ట్వీట్'గా మార్చారు.
Elon Musk latest news : ఎలాన్ మస్క్ రాకతో తమ ఉద్యోగాలు పోతాయేమో అని చాలా మంది ఉద్యోగులు భయపడ్డారు. ఇందుకు తగ్గట్టుగానే చాలా మంది ఇప్పటికే ట్విట్టర్‌ను వదిలేశారు. ఇంకొందరు మాత్రం.. మస్క్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూ.. సంస్థలోనే ఉండిపోయారు. మరి వారిపైనా మస్క్ వేటు వేస్తారా? లేదా అన్నది వేచి చూడాలి.
సంబంధిత కథనం