Live video feature for X: ట్విటర్ లో ఇక ‘లైవ్ వీడియో’ ఆప్షన్; ఎలా యూజ్ చేయాలంటే..?-elon musk introduces live video feature for x heres how you can use it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Live Video Feature For X: ట్విటర్ లో ఇక ‘లైవ్ వీడియో’ ఆప్షన్; ఎలా యూజ్ చేయాలంటే..?

Live video feature for X: ట్విటర్ లో ఇక ‘లైవ్ వీడియో’ ఆప్షన్; ఎలా యూజ్ చేయాలంటే..?

HT Telugu Desk HT Telugu
Aug 04, 2023 09:27 PM IST

Live video feature for X: ‘ఎక్స్ (X)’ గా పేరు మార్చుకున్న ట్విటర్ లో ఇక యూజర్లు కొత్తగా ‘లైవ్ వీడియో’ (live video) ఆప్షన్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విషయాన్ని ‘ఎక్స్ (X)’ సీఈఓ ఇలాన్ మస్క్ ఈ విషయాన్ని శుక్రవారం ఒక ట్వీట్ లో వెల్లడించారు. ఈ లైవ్ వీడియో ఆప్షన్ ను ఎలా యూజ్ చేయాలో కూడా వివరించారు.

’ఎక్స్‘ సీఈఓ ఇలాన్ మస్క్
’ఎక్స్‘ సీఈఓ ఇలాన్ మస్క్ (REUTERS)

Live video feature for X: ‘ఎక్స్ (X)’ గా పేరు మార్చుకున్న ట్విటర్ (twitter) లో ఇక యూజర్లు కొత్తగా ‘లైవ్ వీడియో’ (live video) ఆప్షన్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ విషయాన్ని ‘ఎక్స్ (X)’ సీఈఓ ఇలాన్ మస్క్ ఈ విషయాన్ని శుక్రవారం ఒక ట్వీట్ లో వెల్లడించారు. ఈ లైవ్ వీడియో ఆప్షన్ ను ఎలా యూజ్ చేయాలో కూడా వివరించారు. కొత్త లైవ్ వీడియో ఆప్షన్ చాలా బాగా పని చేస్తోందని, ఉపయోగించడం కూడా చాలా సులువని తెలిపారు.

how to use live video feature: కెమెరా బటన్ పై..

లైవ్ వీడియో ఆప్షన్ ను తను స్వయంగా ఉపయోగించి, ఆ వివరాలను మస్క్ తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ఎక్స్ లేదా ట్విటర్ ను ఓపెన్ చేసి, మీ ప్రొఫైల్ వద్ద కనిపించే కెమెరా బటన్ ను ప్రెస్ చేసి లైవ్ వీడియో ను స్టార్ట్ చేయవచ్చు. లైవ్ వీడియోను స్టార్ట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు..

  • ట్విటర్ లేదా ఎక్స్ లో కంపోజర్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
  • లైవ్ (live) బటన్ పై క్లిక్ చేయాలి.
  • ట్వీట్ లోని డిస్క్రిప్షన్ ఆప్షన్ వద్ద మీ ట్వీట్ గురించిన వివరాలు ఫిల్ చేయవచ్చు. లొకేషన్ ను యాడ్ చేయవచ్చు. ఇది ఆప్షనల్. అవసరం లేదనుకుంటే ఫిల్ చేయనక్కర లేదు.
  • ‘గో లైవ్’ (go live) బటన్ పై ట్యాప్ చేయండి.
  • దాంతో, మీ లైవ్ వీడియో మీ స్క్రీన్ పై, అలాగే, మీ ఫాలోవర్ల టైమ్ లైన్ పై కనిపిస్తుంది.
  • ఈ లైవ్ వీడియో (live video) ను ఆపేయాలనుకుంటే పైన ఎడమవైపు కనిపించే స్టాప్ (stop) బటన్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

ట్విటర్ లో వీడియో క్లిప్ లను డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు గురువారం ఇలాన్ మస్క్ ప్రకటించారు. ఆ వీడియోను రూపొందించిన వారి అనుమతితో ఆ క్లిప్ లను డౌన్ లోడ్ చేసుకునేలా వీలు కల్పిస్తున్నామన్నారు. అయితే, ఈ సదుపాయం కేవలం ‘వెరిఫైడ్ అకౌంట్స్’ కే ఉందన్నారు. వీడియో ప్లే అవుతున్న సమయంలో కుడి వైపు పైన కనిపించే డౌన్ లోడ్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో క్లిప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.