Bank Holiday today : ఆంధ్ర, తెలంగాణలో నేడు బ్యాంక్‌లకు సెలవు.. రేపు కూడా!
Telangana Bank holiday today : బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు. రేపు కూడా బ్యాంకులు పని చేయవు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీని కేంద్ర ప్రభుత్వ సెలవుదినంగా గుర్తించిన నేపథ్యంలో సెప్టెంబర్ 16, సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మిజోరాం, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, మణిపూర్, జమ్మూ, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఈద్-మిలాద్ సందర్భంగా బ్యాంకులకు నేడు సెలవు ఉంటుంది.
అంతేకాదు.. గణేశ్ నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 17, మంగళవారం కూడా బ్యాంకులకు సెలవు. అంటే.. సెప్టెంబర్ 14 రెండో శనివారం నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవుల్లో ఉన్నాయి.
ఈ వారంలో మరిన్ని సెలవులు..
వీటితో పాటు సెప్టెంబర్ 18న శ్రీ నారాయణ గురు జయంతి (బుధవారం) - కేరళలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 21 (శ్రీ నారాయణ గురు సమాధి - కేరళ), సెప్టెంబర్ 22 (ఆదివారం - పాన్-ఇండియా), సెప్టెంబర్ 23 (వీరమరణ దినం - హరియాణా) సెలవులు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 25న శ్రీనగర్‌లో బ్యాంకులు మూతపడి ఉంటాయి.
సెప్టెంబర్ 7న బ్యాంకులకు వినాయక చవితి సెలవు లభించింది. వారాంతపు సెలవులను కూడా కలుపుకుంటే.. సెప్టెంబర్‌లో బ్యాంకులకు మొత్తం మీద 14 రోజుల వరకు సెలవులు లభించాయి. అయితే ఇవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి.
ఇదీ చూడండి:- 2 Pan Cards Penalty : మీ దగ్గర 2 పాన్ కార్డులు ఉన్నాయా? అయితే రూ.10 వేల ఫైన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ- స్థానిక సందర్భాలు, కార్యాచరణ అవసరాలు, మతపరమైన వేడుకలు, ఇతర సాంస్కృతిక ఆచారాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందిస్తాయి. సెంట్రల్ బ్యాంక్ తన అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ప్రకటన చేస్తుంది. ఈ బ్యాంకు సెలవుల లిస్ట్‌ని ముందే తెలుసుకుని మీరు జాగ్రత్త పడి, బ్యాంక్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందుబాటులో ఆన్లైన్ బ్యాంకింగ్..
బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. సులభంగా లావాదేవీలు నిర్వహించడానికి, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి, ఇతర ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి వీటిని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
నగదు అత్యవసర పరిస్థితుల కోసం, సెలవులతో సంబంధం లేకుండా అన్ని బ్యాంకులు వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవల యాప్స్‌ని నిర్వహిస్తాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటిఎంనైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం