Electric car : ఈ ఎలక్ట్రిక్​ కారు సేల్స్​ టాటా ఈవీలను దాటేశాయి- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..-check out best selling electric car mg windsor ev on road price in hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : ఈ ఎలక్ట్రిక్​ కారు సేల్స్​ టాటా ఈవీలను దాటేశాయి- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Electric car : ఈ ఎలక్ట్రిక్​ కారు సేల్స్​ టాటా ఈవీలను దాటేశాయి- హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Dec 03, 2024 12:10 PM IST

MG Windsor EV on road price Hyderabad : ఇండియాలో గత రెండు నెలలుగా బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా కొనసాగుతోంది ఎంజీ విండ్సర్​ ఈవీ! ఈ ఈవీ రేంజ్​తో పాటు హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బెస్ట్​ సెల్లింగ్​ ఎంజీ విండ్సర్​ ఈవీ..
బెస్ట్​ సెల్లింగ్​ ఎంజీ విండ్సర్​ ఈవీ..

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో ఇటీవలే లాంచ్​ అయిన ఎంజీ విండ్సర్​ ఈవీ దుమ్మురేపుతోంది. వరుసగా రెండు నెలల పాటు బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా నిలిచింది ఈ ఎంజీ విండ్సర్​. మరీ ముఖ్యంగా.. ఇండియన్​ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న టాటా మోటార్స్​కి చెందిన ఈవీలను వెనక్కి నెట్టి మరీ సేల్స్​లో ఈ కారు దూసుకెళుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఎంజీ విండ్సర్​ ఈవీ రేంజ్​, హైదరాబాద్​లో ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

టాటా ఈవీలను దాటేసిన ఎంజీ విండ్సర్​..

2024 నవంబర్​లో ఎంజీ విండ్సర్​ ఈవీకి సంబంధించిన 3,144 యూనిట్​లను విక్రయించినట్టు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ తెలిపింది. అక్టోబర్​లో సైతం సేల్స్​ భారీగానే జరిగాయి. ఫలితంగా ఈ మోడల్​ వరుసగా రెండు నెలల పాటు బెస్ట్​ సెల్లింగ్​గా ఉంది. ఇక నవంబర్​లో, ఎలక్ట్రిక్​ వెహికిల్​ సేల్స్​ విషయంలో ఎంజీ మోటార్​ సంస్థ (6019).. టాటా మోటార్స్​ (5,202)ని దాటేసింది. ఇందులో కీలక భాగం ఇటీవలే లాంచ్​ అయిన ఎలక్ట్రిక్​ కారుదే.

హైదరాబాద్​లో ఎంజీ విండ్సర్​ ఈవీ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..

  • ఎంజీ విండ్సర్​ ఈవీ ఎగ్జైట్​- రూ. 14.22 లక్షలు
  • ఎంజీ విండ్సర్​ ఈవీ ఎక్స్​క్లూజివ్​- రూ. 15.27 లక్షలు
  • ఎంజీ విండ్సర్​ ఈవీ ఎసెన్స్​- రూ. 16.32 లక్షలు

ఈ మూడు వేరియంట్లలో టాప్​ ఎండ్​ మోడల్​ ఎంజీ విండ్సర్​ ఈవీ ఎసెన్స్​ బెస్ట్​ సెల్లింగ్​గా ఉండటం విశేషం.

సాధారణంగా వెహికల్​కి ఎక్స్​షోరూం ప్రైజ్​, ఆన్​రోడ్​ ప్రైజ్​లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో ఆటోమొబైల్​ సంస్థలు ఎక్స్​షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్​రోడ్​ ప్రైజ్​ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్​ని కొనే ముందు, ఎక్స్​షోరూం ప్రైజ్​ కాకుండా ఆన్​రోడ్​ ప్రైజ్​ తెలుసుకుని బడ్జెట్​ వేసుకోవాలి. సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్​పై ఏవైనా ఆఫర్స్​ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఎంజీ విండ్సర్​ ఈవీ రేంజ్​..

విండ్సర్​ ఈవీలో జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని ఉపయోగిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్​ని అందిస్తుంది. రియాలిటీలో, డ్రైవింగ్ రేంజ్​ 260 నుంచి 280 కిలోమీటర్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీ ప్యాక్​ని కేవలం 55 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

ఎంజీ విండ్సర్ ఈవీ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి స్టార్​బరస్ట్​ బ్లాక్, పర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్.

Whats_app_banner

సంబంధిత కథనం