BSA Gold Star 650 vs Royal Enfield Interceptor 650 : ఈ రెండు రెట్రో బైక్స్​లో ఏది బెస్ట్​?-bsa gold star 650 vs royal enfield interceptor 650 which bike you should buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsa Gold Star 650 Vs Royal Enfield Interceptor 650 : ఈ రెండు రెట్రో బైక్స్​లో ఏది బెస్ట్​?

BSA Gold Star 650 vs Royal Enfield Interceptor 650 : ఈ రెండు రెట్రో బైక్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Aug 16, 2024 01:39 PM IST

Royal Enfield Interceptor 650 price Hyderabad : బీఎస్​ఏ గోల్డ్ స్టార్ 650 వర్సెస్ రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ 650.. ఈ రెండు రెట్రో బైక్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఫీచర్స్​ ఏంటి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు రెట్రో బైక్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు రెట్రో బైక్స్​లో ఏది బెస్ట్​?

క్లాసిక్ లెజెండ్స్ బీఎస్​ఏ బ్రాండ్​ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. బీఎస్​ఏ గోల్డ్​ స్టార్​ను భారతీయులకు పరిచయం చేసింది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఈ మోటార్ సైకిల్ ఎట్టకేలకు మన దేశానికి వచ్చి రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 650తో నేరుగా పోటీ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

బీఎస్​ఏ గోల్డ్ స్టార్ 650 వర్సెస్ రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ 650: లుక్స్

రెండు మోటార్ సైకిళ్లు రెట్రో డిజైన్ లాంగ్వేజ్​ను కలిగి ఉన్నాయి. గోల్డ్ స్టార్ మరింత క్లాసిక్ డిజైన్ లాంగ్వేజ్​ను కలిగి ఉండగా, ఇంటర్​సెప్టర్ 650 రోస్టర్ గా తయారైంది. అయితే ఇంటర్​సెప్టర్​లో ఇప్పుడు ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్, అల్లాయ్ వీల్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

బీఎస్​ఏ గోల్డ్ స్టార్ 650 వర్సెస్ రాయల్ ఎన్​ఫీల్డ్ ఇంటర్​సెప్టర్ 650: స్పెసిఫికేషన్స్

గోల్డ్ స్టార్ 650 బైక్​లో లిక్విడ్-కూల్డ్, డీఓహెచ్​సీ, 4 వాల్వ్ కాన్ఫిగరేషన్ కలిగిన 652సీసీ ఇంజిన్ ఉంది. ఇది 6,000 ఆర్​పీఎమ్ వద్ద 45 హార్స్ పవర్, 4,000 ఆర్​పీఎమ్ వద్ద 55 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్​కు బదులుగా 5-స్పీడ్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

ఇంటర్​సెప్టర్ 650 బైక్​లో 648 సీసీ ట్విన్, ఫోర్-స్ట్రోక్, సింగిల్ ఓవర్​హెడ్ క్యామ్, ఎయిర్/ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 7,150 ఆర్​పీఎమ్ వద్ద 47బీహెచ్​పీ పవర్.. 5,250 ఆర్​పీఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, ఈ ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్​మిషన్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 వర్సెస్ రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 650: హార్డ్​వేర్​..

బీఎస్​ఏ గోల్డ్ స్టార్ దాని సస్పెన్షన్ సిస్టమ్ కోసం 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లతో కూడిన డ్యూయెల్-క్రేడిల్ డిజైన్​తో ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్​తో వస్తుంది.. బ్రేకింగ్ కోసం, ముందు భాగంలో సింగిల్ 320 ఎంఎం డిస్క్, వెనుక భాగంలో 255 ఎంఎఁ డిస్క్ ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు, బరువు 213 కిలోలు.

వీటితో పోలిస్తే, కీలక పోటీదారు అయిన రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 650 కూడా ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్​ని ఉపయోగిస్తుంది. దీని సస్పెన్షన్ సిస్టెమ్ 41 ఎంఎం ఫ్రంట్ ఫోర్క్, 110 ఎంఎం ట్రావెల్, ట్విన్ కాయిల్-ఓవర్ షాక్లతో 88 ఎంఎంని అందిస్తుంది. ఇంటర్​సెప్టర్ 650 174 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. 13.7 లీటర్ల ఇంధన సామర్థ్యం, మొత్తం బరువు 202 కిలోలు.

బీఎఏ గోల్డ్ స్టార్ 650 వర్సెస్ రాయల్ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్ 650: ధర

గోల్డ్ స్టార్ 650 ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల వరకు ఉంటుంది. ఇది ఇంట్రొడక్టరీ ప్రైజ్​. మరోవైపు ఇంటర్​సెప్టర్ 650 ధర రూ.3.03 లక్షల నుంచి రూ.3.31 లక్షల మధ్యలో ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

Whats_app_banner

సంబంధిత కథనం