New Smartwatch launch: బ్లూటూత్ కాలింగ్‍తో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. తక్కువ ధరకే!-boat wave flex connect smartwatch launched check price specifications details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Boat Wave Flex Connect Smartwatch Launched Check Price Specifications Details

New Smartwatch launch: బ్లూటూత్ కాలింగ్‍తో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. తక్కువ ధరకే!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 04, 2023 09:22 AM IST

boAt Wave Flex Connect Smartwatch: బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. బడ్జెట్ ధరలో బ్లూటూత్ కాలింగ్, 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్ స్క్వేర్ డిస్‍ప్లేతో ఈ వాచ్ వస్తోంది.

New Smartwatch launch: బ్లూటూత్ కాలింగ్‍తో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ (Photo: boAt)
New Smartwatch launch: బ్లూటూత్ కాలింగ్‍తో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ (Photo: boAt)

boAt Wave Flex Connect Smartwatch: దేశీయ కంపెనీ బోట్(boAt).. బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌వాచ్‍ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ (boAt Wave Flex Connect) వాచ్‍ను లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, కర్వ్ గ్లాస్ డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. మెటల్ బాడీ, సిలికాన్ స్ట్రాప్‍లతో వస్తోంది. ప్రధానమైన హెల్త్ ఫీచర్లు, విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‍లతో వస్తోంది. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్

boAt Wave Flex Connect Smartwatch: బోట్ వేవ్ ఫ్లెక్స్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,499గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, బోట్ కంపెనీ అఫీషియల్ వెబ్‍సైట్ నుంచి ఈ వాచ్‍ను కొనుగోలు చేయవచ్చు. యాక్టివ్ బ్లాక్, చెర్రీ బ్లాసమ్, డీప్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది.

బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్పెసిఫికేషన్లు

boAt Wave Flex Connect Specifications: 240 x 280 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.83 ఇంచుల స్క్వేర్ షేప్డ్ డిస్‍ప్లేతో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ వాచ్ వస్తోంది. 2.5డీ కర్వ్డ్ గ్లాస్.. డిస్‍ప్లేపై ఉంటుంది. 550 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 100కుపైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. సిలికాన్ స్ట్రాప్‍తో ఈ వాచ్ వస్తోంది. ఈ వాచ్ బాడీని మెటల్‍తో బోట్ రూపొందించింది. దీంతో లుక్స్ పరంగా ఇది ప్రీమియమ్‍గా కనిపిస్తుంది.

boAt Wave Flex Connect: కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.1తో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్, స్పీకర్ ఉంటాయి. దీంతో ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. ఇక ఫోన్‍కు వచ్చే నోటిఫికేషన్లను కూడా వాచ్‍లోనే పొందవచ్చు.

boAt Wave Flex Connect: ఫిట్‍నెస్ ట్రాకింగ్ కోసం విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ Smartwatch సపోర్ట్ చేస్తుంది. నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కొలిచే ఎస్‍పీఓ2 మానిటర్, స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లతో బోట్ వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్ వస్తోంది.

boAt Wave Flex Connect Smartwatchలో 240mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని బోట్ పేర్కొంది. బ్లూటూత్ కాలింగ్‍తో హెవీ యూసేజ్‍పై రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ రావొచ్చు. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం