boAt New Headphones: నెట్‍ఫ్లిక్స్ భాగస్వామ్యంతో బోట్ కొత్త హెడ్‍ఫోన్స్ లాంచ్.. ఇయర్‌బడ్స్ కూడా..
boAt New Headphones: నెట్‍ఫ్లిక్స్ భాగస్వామ్యంతో మూడు కొత్త హెడ్‍ఫోన్స్ మోడళ్లను బోట్ లాంచ్ చేసింది. ఓవర్ ది ఇయర్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, నెక్‍బ్యాండ్ ఇయర్‌ఫోన్లను తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇవే.
boAt New Headphones: పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ (Netflix)తో ఇండియన్ బ్రాండ్ బోట్ (boAt) భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంట్లో భాగంగా బోట్ కొత్తగా స్ట్రీమ్ ఎడిషన్ హెడ్‍ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ విభాగంలో బోట్ నిర్వానా 751 ఏఎన్‍సీ (boAt Nirvana 751 ANC) వైర్లెస్ హెడ్‍సెట్, బోట్ ఎయిర్డోప్స్ 411 ఏఎన్‍సీ (boAt Airdopes ANC) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, బోట్ రాకర్జ్ 333 ప్రో (boAt Rockerz 333 Pro) నెక్‍బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఈ హెడ్‍ఫోన్స్ అన్నింటిపై నెట్‍ఫ్లిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. ఈ కొత్త హెడ్‍ఫోన్స్, ఇయర్‌బడ్స్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే.
ధర, సేల్ వివరాలు
boAt New Headphones: బోట్ నిర్వానా 751 ఏఎన్‍సీ వైర్లెస్ ఓవర్ ది ఇయర్ హెడ్‍ఫోన్స్ ధర రూ.3,999గా ఉంది. బోట్ ఎయిర్డోప్స్ 411 ఏఎన్‍సీ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర రూ.1,899, బోట్ రాకర్జ్ 33 ప్రో నెక్‍బ్యాండ్ ధర రూ.1,299గా ఉంది. ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‍కార్ట్ తో పాటు బోట్ అధికారిక వెబ్‍సైట్‍లో రేపు (డిసెంబర్ 20) ఈ హెడ్‍ఫోన్స్ అన్నీ సేల్‍కు వస్తాయి. బోట్ వెబ్‍సైట్‍లో ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
boAt Nirvana 751 ANC Specifications: 40mm సౌండ్ డ్రైవర్లతో బోట్ నిర్వానా 751 ఏఎన్‍సీ ఓవర్ ది ఇయర్ హెడ్‍ఫోన్స్ వస్తున్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC), బ్లూటూత్ 5.0 కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. యాపిల్ సిరి, గూగుల్ వాయిస్ అసిస్టెంట్‍లకు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 65 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
boAt Airdopes 411 ANC Specifications: బోట్ ఎయిర్డోప్స్ 411 ఏఎన్‍సీ బడ్స్ 10mm సౌండ్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఏఎన్‍సీ ఫీచర్ ఉంటుంది. చార్జింగ్ కేస్‍తో కలిపి మొత్తంగా 17.5 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. బ్లూటూత్ 5.2 వెర్షన్ కనెక్టివిటీ, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెంట్స్ ఉంటుంది.
boAt Rockerz 33 Pro Specifications: బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో బోట్ రాకర్జ్ 333 ప్రో నెక్‍బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. 10mm సౌండ్ డ్రైవర్స్ ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్ ఉంటుంది. 10 నిమిషాల చార్జింగ్‍తో 20 గంటల వరకు ఈ ఇయర్‌ఫోన్స్ వాడుకోవచ్చని బోట్ పేర్కొంది.