Best Camera Phones : ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో కెమెరా క్వాలిటీ.. ది బెస్ట్!
Best Camera Phones : కెమెరా క్వాలిటీ సూపర్‌గా ఉండే స్మార్ట్‌ఫోన్స్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
Best Camera Phones : ఈ టెక్ యుగంలో సోషల్ మీడియాకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా.. ప్రజలు వారు తీసిన ఫొటోలను షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి.. ఫొటోలు షేర్ చేయాలంటే, సరైన కెమెరా ఉండాలి కదా! అందుకే.. మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చాలా మంది చూస్తున్నారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? అయితే ఇది మీకోసమే! ది బెస్ట్ కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్‌ఫోన్స్ వివరాలు మీకోసం..
ఒప్పో రెనో10 ప్రో+ 5జీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ది బెస్ట్ కెమెరా క్వాలిటీ ఉందని చెప్పుకోవాలి. పోట్రైట్ మోడ్‌లో ప్రో పవర్ ఆప్షన్ ఉంది. కెమెరా సెటప్ ప్రొఫెషనల్ లెవల్లో ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ (ఓఐఎస్), 64ఎంపీ (టెలిఫొటో పోట్రైట్), 112 డిగ్రీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా వంటివి వస్తున్నాయి. ఇక సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ఇందులో ఆటోఫోకస్ ఫీచర్‌తో కూడిన 32ఎంపీ అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరా లభిస్తోంది. ఎలాంటి లైటింగ్ కండీషన్లోనైనా.. క్లియర్ ఫొటోలు తీసుకోవచ్చు. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 120ఎక్స్ డిజిటల్ జూమ్, ఏఎల్‌డీ కోటింగ్, ఓఐఎస్ సపోర్ట్ వంటివి వస్తున్నాయి. ఈ ఒప్పో రెనో 10 ప్రో+ ధర రూ. 59,999గా ఉంది.
గూగుల్ పిక్సెల్ 8..
Google Pixel 8 camera : గూగుల్ పిక్సెల్ 8లో 50ఎంపీ+12ఎంపీ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రెంట్లో 10.5ఎంపీ కెమెరా లభిస్తుంది. ఇందులో మేజిక్ ఎడిటర్ ఉంటుంది. స్టూడియో క్వాలిటీ స్టైల్లో ఫొటోలను ఎడిట్ చేసుకోవచ్చు. లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మేజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్ వంటివి కూడా ఉన్నాయి. ఈ మోడల్ ధర రూ. 75,999.
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ..
ఈ సామ్సంగ్ గ్యాడ్జెట్లో నైట్ మోడ్ ఉంటుంది. అతి తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. 200ఎంపీ రేర్ కెమెరా, 12ఎంపీ ఫ్రెంట్ కెమెరా దీని సొంతం. వీడియో స్టెబిలైజింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని ధర రూ. 1,49,999.
యాపిల్ ఐఫోన్ 14 ప్రో..
Apple iPhone 14 pro camera : ఐఫోన్ 14 ప్రోలో 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీ కెమెరా దీని సొంతం. హై రిసొల్యూషన్తో ఫొటోలు తీసుకోవచ్చు. సినిమాటిక్ మోడ్‌తో 4కే డాల్బీ విజన్, యాక్షిన్ మోడ్ వంటివి ఉన్నాయి. 3200ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఈ మోడల్ ధర 1,29,900.
యాపిల్ ఐఫోన్ 15..
యాపిల్ ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ మోడల్లో 48ఎంపీ ప్రైమరీ, 2ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ టెలీఫొటో లెన్స్‌లు వస్తున్నాయి. నెక్స్డ్ జనరేషన్ పోట్రైట్ ఫీచర్‌తో ఫోకస్‌ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ మోడల్ ధర ప్రస్తుతం రూ. 79,900గా ఉంది.
సంబంధిత కథనం