Samsung Galaxy S24 : సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​పై క్రేజీ అప్డేట్​! ఫీచర్స్​ లీక్​..-samsung galaxy s24 series likely to launch in january features leaked ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy S24 : సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​పై క్రేజీ అప్డేట్​! ఫీచర్స్​ లీక్​..

Samsung Galaxy S24 : సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​పై క్రేజీ అప్డేట్​! ఫీచర్స్​ లీక్​..

Sharath Chitturi HT Telugu
Oct 29, 2023 06:18 PM IST

Samsung Galaxy S24 : సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​పై ఓ క్రేజీ అప్డేట్​ వచ్చింది. దీనితో పాటు పలు కీలక ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలు..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​పై క్రేజీ అప్డేట్​! ఫీచర్స్​ లీక్​..
సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​పై క్రేజీ అప్డేట్​! ఫీచర్స్​ లీక్​..

Samsung Galaxy S24 series : సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 సిరీస్​ ఎప్పుడు వస్తుందా.. అని స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పుడొక క్రేజీ వార్త బయటకొచ్చింది. ఈ మోడల్​.. లాంచ్​కు సిద్ధమవుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 లాంచ్​ ఎప్పుడు..?

గెలాక్సీ ఎస్​24 సిరీస్​ ప్రొడక్షన్​ దశకు చేరుకుందని తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ మోడల్​.. అంతర్జాతీయంగా 2024 జనవరిలో లాంచ్​ అవుతుందని సమాచారం. కరెక్ట్​ డేట్​పై ఇంకా క్లారిటీ లేదు కానీ.. జనవరి చివరి వారంలో ఇది మర్కెట్​లోకి అడుగుపెడుతుందట. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్​నే సంస్థ ప్లాన్​ చేస్తోందట!

Samsung Galaxy S24 launch date : గెలాక్సీ ఎస్​24 సిరీస్​లోని స్టాండర్డ్​ మోడల్​కు చైనా ఇప్పటికే సర్టిఫికేషన్​ లభించింది. ఇక ఈ స్మార్ట్​ఫోన్​ సిరీస్​కు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన లీక్స్​ చాలా అట్రాక్టివ్​గా ఉన్నాయి. క్రేజీ ఫీచర్స్​ ఇందులో ఉండొచ్చని ఆశలు రేకెత్తిస్తున్నాయి.

ఈ సామ్​సంగ్​ కొత్త గ్యాడ్జెట్​లో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.17 ఇంచ్​ డైనమిక్​ అమోలెడ్​ డిస్​ప్లే, 3,900ఎంఏహెచ్​ లేదా 4000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని టాక్​ నడుస్తోంది. స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 3 చిప్​సెట్​ ఉంటుందని లీక్స్​ సూచిస్తున్నాయి.

Samsung Galaxy S24 ultra : ఈ సిరీస్​లో స్టాండర్డ్​ ఎస్​24, ఎస్​24+, ఎస్​24 అల్ట్రా మోడల్స్​ ఉండొచ్చు. జూమ్​ ఎనీ ప్లేస్​, ఈ2ఈ రెమోసాయిక్​ వంటి ఫీచర్స్​ను ఈ సిరీస్​లో తీసుకురావాలని సంస్థ ప్లాన్​ చేస్తోంది! సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 సిరీస్​ మొత్తానికి టిటానియం బాడీ లభిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఐఫోన్​ 15 ప్రో మోడల్​కు ఇదే బాడీ ఉంది.

అయితే.. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​గానే ఉన్నాయి. సంస్థ నుంచి అధికారిక ప్రకటనలేవీ లేవు. లాంచ్​ సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 సిరీస్​పై మరిన్ని వివరాలు బయటకు వస్తాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం