Bank holidays: ఏప్రిల్ నెలలో బ్యాంక్ లకు ఇన్ని సెలవులా?.. ఇక్కడ లిస్ట్ చూడండి-bank holidays in april 2024 banks closed for 14 days across states list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bank Holidays: ఏప్రిల్ నెలలో బ్యాంక్ లకు ఇన్ని సెలవులా?.. ఇక్కడ లిస్ట్ చూడండి

Bank holidays: ఏప్రిల్ నెలలో బ్యాంక్ లకు ఇన్ని సెలవులా?.. ఇక్కడ లిస్ట్ చూడండి

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 02:02 PM IST

Bank holidays in April 2024: 2024 ఏప్రిల్ నెలలో 14 రోజుల పాటు బ్యాంక్ లకు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ నెలలో వచ్చే బ్యాంక్ హాలీడేస్ కు సంబంధించిన లిస్ట్ ను ఇక్కడ చూడండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Bank holidays in April 2024: ఏప్రిల్ నెలలో దాదాపు 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా ఈ సంఖ్యలో కొద్దిగా తేడాలుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెలవుల జాబితా ప్రకారం ఇందులో ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు ఉంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందు ఖాతాదారులు బ్యాంకు సెలవుల జాబితాను సరిచూసుకోవడం మంచిది.

ఈ పండుగల సందర్భంగా..

2024 ఏప్రిల్ లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి / జుమత్-ఉల్-విదా, గుడి పడ్వా / ఉగాది పండుగ / సజిబు నోంగ్మాపన్బా (ఛైరోబా)/ రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్), బోహాగ్ బిహు / చిరోబా / బైసాఖి / బిజు పండుగ, బోహాగ్ బిహు / హిమాచల్ డే, శ్రీరామనవమి .. తదితర పండుగల సందర్బంగా బ్యాంక్ లకు సెలవులు ఉన్నాయి.

ఏప్రిల్ లో బ్యాంకు సెలవులు

ఏప్రిల్ 1, 2024 న బ్యాంకులు మూసివేసి (Bank holidays) ఉంటాయి. మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో మాత్రం ఏప్రిల్ 1న బ్యాంకులు తెరిచి ఉంటాయి.

ఏప్రిల్ 5, 2024: బాబు జగ్జీవన్ రామ్ జయంతి/ జుమత్-ఉల్-విదాను పురస్కరించుకుని తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్ లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 9, 2024: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూ, శ్రీనగర్లలో గుడి పడ్వా / ఉగాది పండుగ / సజిబు నాంగ్మపన్బా (చిరోబా) సందర్బంగా బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 10, లేదా ఏప్రిల్ 11, 2024: రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) బ్యాంకు సెలవు .

ఏప్రిల్ 13, 2024 (రెండవ శనివారం): బోహాగ్ బిహు / చిరోబా / బైసాఖి / బిజూ పండుగ కోసం త్రిపుర, అస్సాం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 15, 2024: అస్సాం, హిమాచల్ ప్రదేశ్లో బ్యాంకులకు సెలవు.

ఏప్రిల్ 16, 2024: శ్రీరామనవమి సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 20, 2024: త్రిపురలో బ్యాంకులకు సెలవు.

WhatsApp channel