Bajaj Holdings Q4: 22 శాతం పెరిగిన బజాజ్ హోల్డింగ్స్ లాభాలు; ఫైనల్ డివిడెండ్ ప్రకటన
Bajaj Holdings Q4: లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ హోల్డింగ్స్ గురువారం 2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) ఫలితాలను ప్రకటించింది.
Bajaj Holdings Q4: బజాజ్ హోల్డింగ్స్ (Bajaj Holdings) 2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (Q4FY23) రూ. 1,352.8 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది 2021 -22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో (Q4FY22) పోలిస్తే 22.4% అధికం. 2021 -22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బజాజ్ హోల్డింగ్స్ (Bajaj Holdings) రూ. 1,105 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
Bajaj Holdings Q4: ఆదాయంలో నిరాశాజనక ఫలితాలు
బజాజ్ హోల్డింగ్స్ (Bajaj Holdings) ఆపరేషన్స్ ఆదాయం ఈ Q4FY23 లో స్వల్పంగా తగ్గింది. Q4FY23 లో బజాజ్ హోల్డింగ్ ఆపరేషన్స్ ఆదాయం రూ. 86.7 కోట్లు కాగా, Q4FY22లో బజాజ్ హోల్డింగ్స్ (Bajaj Holdings) ఆపరేషన్స్ ఆదాయం 89.5 కోట్లు.
Bajaj Holdings Q4: డివిడెండ్ రూ. 13
షేర్ హోల్డర్లకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఫైనల్ డివిడెండ్ గా రూ. 13 ఇవ్వాలని బజాజ్ హోల్డింగ్స్ (Bajaj Holdings) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. ఫైనల్ డివిడెండ్ చెల్లింపునకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ధారించే రికార్డ్ డేట్ ను జూన్ 30, 2023 అని నిర్ణయించారు. ఈ డివిడెండ్ మొత్తం షేర్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాల్లో జులై 31 లేదా ఆగస్ట్ 1 వ తేదీలోగా జమ అవుతుంది. బజాజ్ హోల్డింగ్స్ షేర్ విలువ ఏప్రిల్ 27, గురువారం 2.11% పెరిగి రూ. 6,679.90 వద్ధ స్థిరపడింది.