Apple Watch X : సరికొత్త డిజైన్‌తో యాపిల్ వాచ్ ఎక్స్.. లాంచ్ ఎప్పుడు?
Apple Watch X : యాపిల్ వాచ్ ఎక్స్‌పై బజ్ నెలకొంది. ఈ మోడల్‌కు సంస్థ సరికొత్త డిజైన్‌ను ఇవ్వనుందని తెలుస్తోంది.
Apple Watch X series : యాపిల్ వాచ్ రూపురేఖలు మారిపోనున్నాయి! సరికొత్త డిజైన్‌తో యాపిల్ వాచ్ “ఎక్స్” సిద్ధమవుతోందని సమాచారం. యాపిల్ వాచ్ సిరీస్ 10వ వార్షికోత్సవం నేపథ్యంలో ఈ డివైజ్.. 2024లో లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాము..
యాపిల్ కొత్త స్మార్ట్‌వాచ్ విశేషాలివే..
ఈ యాపిల్ వాచ్ ఎక్స్‌లో.. అమోలెడ్ డిస్ప్లే స్థానంలో మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. మరి దీనిని ఎక్స్ మోడల్‌కు సంస్థ తీసుకొస్తుందా? లేదా? అన్నది చూడాలి. అంతేకాకుండా.. ఈ వాచ్‌లో బ్లడ్ ప్రెజర్‌ను మానిటర్ చేసే కొత్త సెన్సార్ కూడా ఉండనుంది.
Apple Watch X design : ఇందులో ఇన్నోవేటివ్ బ్యాండ్ అటాచ్మెంట్ ఉండనుంది. ఫలితంగా బ్యాటరీ సైజు పెరిగే అవకాశం ఉంది. స్పీకర్ సైజు కూడా పెరగొచ్చు.
ఈ యాపిల్ వాచ్ ఎక్స్ ఇతర ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇంకా తెలియలేదు. వీటిపై సంస్థ ప్రకటన చేయాల్సి ఉంది. లాంచ్ డేట్‌పైనా క్లారిటీ లేదు.
యాపిల్ వాచ్ 9 సిరీస్..
మరోవైపు.. యాపిల్ వాచ్ 9 సిరీస్‌ను సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 12న ఇది లాంచ్ అవుతుందని సమాచారం. ఇందులో సరికొత్త ఏ15 బయోనిక్ చిప్ ఉంటుందని తెలుస్తోంది. మిగిలినవన్నీ సిరీస్ 8లో ఉన్న ఫీచర్సే వస్తాయని, డిజైన్ కూడా మారడం లేదని మార్కెట్లో ఊహాగానాలు ఉన్నాయి.
Apple Watch series launch date : అదే సమయంలో స్మార్ట్‌వాచ్‌లకు అప్డేట్స్ ఇచ్చే విషయంలో ఫ్రీక్వెన్సీని తగ్గిస్తూనే, ఎఫెక్టివ్‌నెస్ పెంచాలని యాపిల్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ యాపిల్ వాచ్ 9 సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫీచర్స్ ఇవేనా..?
iPhone 15 pro max price : ఫోన్ ప్రియులు సెప్టెంబర్ నెల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు! యాపిల్ ఐఫోన్ 15 సిరీస్.. సెప్టెంబర్ 12,13 తేదీల మధ్య లాంచ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15, 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ వంటి స్మార్ట్‌ఫోన్స్ ఉండనున్నాయి. ఇక 15 ప్రో మ్యాక్స్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై వచ్చిన లీక్స్‌ను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం