Adani IANS : ప్రముఖ న్యూస్​ ఏజెన్సీ ఐఏఎన్​ఎస్​లో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..!-adani group acquires major stake in ians news agency ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Adani Ians : ప్రముఖ న్యూస్​ ఏజెన్సీ ఐఏఎన్​ఎస్​లో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..!

Adani IANS : ప్రముఖ న్యూస్​ ఏజెన్సీ ఐఏఎన్​ఎస్​లో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..!

Sharath Chitturi HT Telugu
Dec 16, 2023 11:17 AM IST

Adani IANS latest news : ఐఏఎన్​ఎస్​ ఇండియా న్యూస్​ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొన్నారు గౌతమ్​ అదానీ. ఫలితంగా.. ఇప్పుడు మరో న్యూస్​ ఏజెన్సీ, అదానీ వ్యాపారంలోకి చేరింది.

ప్రముఖ న్యూస్​ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..!
ప్రముఖ న్యూస్​ ఏజెన్సీలో మెజారిటీ వాటాను కొనేసిన అదానీ..! (Bloomberg)

Adani IANS news agency : ప్రముఖ న్యూస్​ ఏజెన్సీ ఐఏఎన్​ఎస్​ (ఇండో- ఆసియా న్యూస్​ సర్వీస్​) ఇండియాలో మెజారిటీ వాటాను కొనేసింది అదానీ గ్రూప్​. ఈ గ్రూప్​నకు చెందిన ఏఎంజీ మీడియా నెట్​వర్క్స్​కు ఇప్పుడు.. ఐఏఎన్​ఎస్​ ఇండియన్​ ప్రైవేట్​ లిమిటెడ్​లో 50.5శాతం వాటా ఉంది. ఈ డీల్​తో న్యూస్​ ఏజెన్సీకి చెందిన ఈక్విటీ షేర్లు, ఓటింగ్​ రైట్స్​ వంటివి అదానీ గ్రూప్​ చేతికి వచ్చాయి.

2023 ఆర్థిక ఏడాదిలో ఐఏఎన్​ఎస్ షేర్​ క్యాపిటల్​ రూ. 20లక్షలుగా ఉంది. కంపెనీ ఆదాయం రూ. 11.86కోట్లుగా నమోదైంది. వ్యూహత్మక చర్యల్లో భాగంగా.. ఐఏఎన్​ఎస్ న్యూస్​ ఏజెన్సీలో వాటా కొన్నట్టు ఆదానీ గ్రూప్​నకు చెందిన ఏఎంజీ మీడియా పేర్కొంది.

"వాటా కొనుగోలు తర్వాత.. ఐఏఎన్​ఎస్​ సంస్థ.. ఏఎంఎన్​ఎల్​లో సబ్సిడరీగా ఉంటుంది. ఈ మేరకు ఐఏఎన్​ఎస్​ షేర్​హోల్డర్​ సందీప్​ బామ్​జాతో కూడా ఒప్పందం కుదిరింది," అని ప్రముఖ వార్త సంస్థ నివేదికలో పేర్కొంది.

ఎన్​డీటీవీ కూడా..!

ఇటీవలి కాలంలో మీడియా సంస్థలపై ఫోకస్​ చేసింది అదానీ గ్రూప్​. ఒక్కొక్క మీడియా సంస్థను తన వ్యాపారంలో కలుపుకుంటోంది. ముఖ్యంగా ఎన్​డీటీవీ కూడా ఇప్పుడు అదానీ గ్రూప్​ సబ్సిడరీగా ఉంది. ఎన్​డీటీవీ ప్రొమోటర్, ఫౌండర్స్​​ ప్రణయ్​ రాయ్​, రాధిక రాయ్​లకు చెందిన 27.26శాతం వాటాని రూ. 602 కోట్లకు కొనడంతో ఆ సంస్థలో గౌతమ్​ అదానీ పెరిగింది.

ఎన్​డీటీవీ వ్యవస్థాపకుల వద్ద ఉన్న ఓ కంపెనీని తొలుత కొనుగోలు చేశారు గౌతమ్​ అదానీ. ఆ తర్వాత ఓపెన్​ మార్కెట్​లో భారీ మొత్తంలో ఎన్​డీటీవీ షేర్లు కొనుగోలు చేశారు. అప్పటికే ఎన్​డీటీవీలో ఆయన వాటా 37శాతానికి చేరింది. ఇక ఆ తర్వాత ఓపెన్​ ఆఫర్​ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఎన్​డీటీవీ వ్యవస్థాపకులు తమ వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం