Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే!-5 stocks to buy or sell today 7th october ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu
Oct 07, 2022 08:28 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

<p>స్టాక్స్​ టు బై</p>
స్టాక్స్​ టు బై

Stocks to buy today : అంతర్జాతీయ సానుకూలతల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్లు కొన్ని రోజులుగా రాణిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 57పాయింట్లు మెరుగుపడిన నిఫ్టీ.. 17,331 వద్ద ముగిసింది. ఇక 156 పాయింట్లు పెరిగి.. 58,222 వద్ద స్థిరపడింది సెన్సెక్స్​. నిఫ్టీ బ్యాంక్​ 172 పాయింట్లు పెరిగి.. 39,282 మార్క్​కు చేరింది. స్మాల్​ క్యాప్​ సూచీ 1.13శాతం, మిడ్​ క్యాప్​ సూచీ 1.30శాతం వృద్ధి చెందాయి.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం.. నిఫ్టీ50.. 18,100 నుంచి 16750 వరకు పడింది. 200డీఎంఏ దగ్గర సపోర్టు తీసుకుంది మళ్లీ పెరుగుతోంది. ఇక ఇప్పుడు 17,450-17500 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ పాజిటివ్​గా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టవచ్చని అంటున్నారు. అయితే రానున్న 1-2 ట్రేడింగ్​ సెషన్స్​లో కాన్సాలిడేషన్​ను చూడవచ్చు అని స్పష్టం చేస్తున్నారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ ప్రస్తుతం 30పాయింట్ల నష్టంలో ఉంది. అంటే.. నేడు స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగానే ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : ఇండియన్​ హోటల్స్​ కంపెనీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 303, టార్గెట్​ రూ. 380.
  • టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 97, టార్గెట్​ రూ. 112
  • వేదాంత:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 278, టార్గెట్​ రూ. 320.
  • రిలయన్స్​ ఇండస్ట్రీస్​:- సెల్​ రూ. 2409, స్టాప్​ లాస్​ రూ. 2419, టార్గెట్​ రూ. 2399
  • అదానీ పోర్ట్స్​:- సెల్​ రూ. 819, స్టాప్​ లాస్​ రూ. 823, టార్గెట్​ రూ. 812.

(గమనిక: ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతం ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner