Smartphone overheating : ఈ 5 టిప్స్ పాటిస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్ అవ్వదు!
Smartphone overheating issues : స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్ అవుతోందా? అయితే ఈ 5 టిప్స్ మీకోసమే. అవేంటంటే..
Tips to reduce Smartphone overheating : భారతదేశంలోని అనేక ప్రాంతాలు 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నాయి. వడగాల్పులతో స్మార్ట్ఫోన్లు, ఎయిర్ కండీషనర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వేడెక్కుతున్నాయి. ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు, రోజువారీ పనులు, కాలింగ్, గేమింగ్, స్ట్రీమింగ్, మరెన్నో కారణాలతో మన స్మార్ట్ఫోన్లు గరిష్ట వినియోగంలో ఉన్నాయి. అందుకే.. ఈ మధ్య కాలంలో స్మార్ట్ఫోన్లు ఓవర్ హీట్ అవుతున్నాయని మాటలు పెరుగుతున్నాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో సతమతమవుతుంటే మీ డివైజ్ వేడెక్కకుండా ఉండేందుకు ఫోన్ కూలింగ్ టిప్స్ ఇక్కడ చూడండి..
ముఖ్యమైన ఫోన్ కూలింగ్ టిప్స్..
- వేసవిలో డివైజ్‌ను ఛార్జింగ్ చేసేటప్పుడు మీ స్మార్టఫోన్ కేస్‌ను తొలగించడం మీరు మొదటగా ఆలోచించాల్సిన విషయం. నేటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కారణంగా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌లో ఉంచినప్పుడు వేడెక్కుతుంది.అందువల్ల ఫోన్ కేస్‌ను తొలగించడం వల్ల డివైజ్ హీట్ మెయింటైన్ చేస్తుంది.
- వేసవిలో తగిన టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మినిమమ్ డిస్ప్లే బ్రైట్నెస్ ఉపయోగించడానికి ప్రయత్నించండి. అధిక ప్రకాశంతో ఉంటే, డివైజ్ హీట్ ఎక్కొచ్చు. ఇది పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.
ఇదీ చూడండి:- UPI ATM : యూపీఐతో ఏటీఎంలో క్యాష్‌ని విత్‌డ్రా చేసుకోండి ఇలా..
3. మీరు ఆరుబయట ఉంటే, మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉపయోగించడం మానుకోండి.మీ స్మార్ట్‌ఫోన్‌ను పరిమిత ప్రకాశంతో ఉపయోగించడానికి, సూర్యరశ్మిని నివారించడానికి ఆరుబయట ఉన్నప్పుడు నీడను కనుగొనండి.
Smartphone overheating how to prevent : 4. స్మార్ట్‌ఫోన్ అధిక వినియోగాన్ని తగ్గించండి. ఎక్కువసేపు గేమ్స్ ఆడకండి. హెవీ గేమ్స్ ఆడటానికి గరిష్ట హార్డ్‌వేర్ వాడకం అవసరం. దీని ఫలితంగా స్మార్ట్‌ఫోన్ ఓవర్‌హీట్ అవుతుంది. అందువల్ల, ఇంటి లోపల గేమ్స్ ఆడాలని నిర్ధారించుకోండి. ఎక్కువ గంటలు గేమ్ ప్లేను నివారించండి.
5. మీ స్మార్ట్‌ఫోన్‌ను మీ జేబుల్లో ఉంచవద్దు. ఎందుకంటే ఇది గాలి ప్రసరణను ట్రాప్ చేస్తుంది. మీరు సాధారణం కంటే కొద్దిగా వేడిని ఫీల్ అవ్వొచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ను ఓపెన్ ఏరియాలో ఉంచి సహజసిద్ధమైన గాలి ప్రవాహాన్ని అడ్డుకోకుండా చూసుకోండి..
How to prevent Smartphone overheating : మనం రోజూ అనేక స్మార్ట్ఫోన్లను పరీక్షిస్తున్నప్పుడు, బయటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఓవర్ హీటింగ్ సమస్యలు వస్తుంటాయి. అందువల్ల, మీరు గరిష్ట పనితీరును పొందాలంటే, మీ స్మార్ట్‌ఫోన్ సంవత్సరాల తరబడి ఉపయోగించాలనుకుంటే, ఈ ఫోన్ కూలింగ్ టిప్స్ అనుసరించండి. అవి మీ పరికర పనితీరును ఎలా మారుస్తాయో మీరే చూడండి.
ఇంకో విషయం! మనం ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉన్నాం! టెక్నాలజీ ప్రపంచం నుంచి అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం