Agrigold Case: అగ్రిగోల్డ్ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు-vijayawada police has announced that the concerns of agrigold customers are not allowed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agrigold Case: అగ్రిగోల్డ్ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు

Agrigold Case: అగ్రిగోల్డ్ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు

HT Telugu Desk HT Telugu
Sep 14, 2023 06:20 AM IST

Agrigold Case: అగ్రిగోల్డ్ ఖాతాదారుల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజయవాడలో తలపెట్టిన ధర్నా, ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. విజయవాడలో ఆంక్షలు ఉన్నందున ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ
విజయవాడ డీసీపీ విశాల్ గున్నీ

Agrigold Case: అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో నష్టపోయిన ఖాతాదారులు ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇటీవల అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ఈడీ అటాచ్‌ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.900కోట్లకు పైగా ఖాతాదారులకు చెల్లించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సమీకరించాలనే ప్రయత్నాలకు రకరకాల అటంకాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్‌ అండ్ ఏజెంట్స్‌ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునిచ్చారు.

yearly horoscope entry point

శుక్రవారం ఛలో విజయవాడ కార్యక్రమంతో పాటు జింఖానా గ్రౌండ్ లో శంఖరావ దీక్షకు పిలుపు ఇచ్చాారు.ఈ కార్యక్రమాలకు స్థానిక పోలీసులతో పాటు ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతులు లేవని విజయవాడ పోలీసులు ప్రకటించారు. విజయవాడ నగరంలో సెక్షన్ 144 సిఆర్. పి.సి. మరియు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని ప్రకటించారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే వారిపై ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంసెక్షన్ 143,290,188 R/W 149, సెక్షన్ 32 పోలీసు యాక్ట్ మరియు పి.డి.పి.పి.చట్టం (Prevention of Damage to Public Property Act) సెక్షన్ 3 క్రింద కఠిన చర్యలు. తీసుకుంటామని హెచ్చరించారు.

ముందస్తు సమాచారం ప్రకారం కొంతమంది బయటి వ్యక్తులు ఈ ధర్నా కార్యక్రమములో చేరి హింసకు పాల్పడే అవకాశంఉన్నాయని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు .ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఏ విధమైన అనుమతులు ఇవ్వట్లేదని ప్రకటించారు.

నగరంలో 2000 మంది పోలీస్ సిబ్బంది. సి.సి.కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫి మొదలగు వాటి ద్వారా నిఘా పెట్టి, పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడ వైపు వచ్చు వాహనాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు.

Whats_app_banner