Trains Cancellation : విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు...-trains cancelled in vijayawada railway division ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancellation : విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు...

Trains Cancellation : విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు...

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 01:26 PM IST

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను పాక్షికంగాను, కొన్నింటిని పూర్తిగాను రద్దు చేశారు.

రైళ్లు రద్దు
రైళ్లు రద్దు

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను పాక్షికంగాను, కొన్నింటిని పూర్తిగాను రద్దు చేశారు.విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ఉన్న ‍యలమంచిలి ప్రాంతంలో అదనపు రైల్వే లూప్‌ నిర్మాణ పనుల కోసం పలు రైళ్లను రద్దు చేశారు. నాన్ ఇంటర్‌లాకింగ్‌ పనుల్లో భాగంగా యలమంచిలి వద్ద రైల్వే శాఖ పనులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను పూర్తిగాను మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17267 కాకినాడ పోర్ట్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే రైల్వు జులై 25 నుంచి ఆగష్టు వరకు రద్దైంది. దీంతో పాటు ట్రైన్‌ నంబర్ 17268 విశాఖపట్నం-కాకినాడ పోర్ట్‌ రైలు కూడా రద్దైంది.

ట్రైన్‌ నంబర్ 12718 విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే రైలు జులై 25 నుంచి ఆగష్టు వరకు తుని వరకు మాత్రమే నడుస్తుంది. తుని -విశాఖపట్నం మధ్య రైలును రద్దు చేశారు. 12717 రైలు విశాఖపట్నం-తుని మధ్య రద్దు చేసిన విజయవాడ వరకు నడుపనున్నారు. ట్రైన్‌ నంబర్ 17239 గుంటూరు-విశాఖపట్నం రైలును సామర్లకోట-విశాఖపట్నం మధ్య రద్దు చేశారు. గుంటూరు నుంచి సామర్లకోట వరకు మాత్రమే రైలును నడుపుతారు. తిరుగు ప్రయాణంలో 17240నంబరు రైలును సామర్ల కోట నుంచి గుంటూరుకు నడుపుతారు. ఆగష్టు 2వరకు మార్పులు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది.

IPL_Entry_Point

టాపిక్