Tirupati SVIMS Jobs : తిరుపతి స్విమ్స్ లో 100 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి!-tirupati svims 100 teaching posts vacancy notification released november 15th last date ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Svims Jobs : తిరుపతి స్విమ్స్ లో 100 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి!

Tirupati SVIMS Jobs : తిరుపతి స్విమ్స్ లో 100 టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్, ఇలా అప్లై చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Oct 23, 2023 09:21 PM IST

Tirupati SVIMS Jobs : తిరుపతి స్విమ్స్ లో 100 అధ్యాపక పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. నవంబర్ 15వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్విమ్స్ లో ఉద్యోగాలు
స్విమ్స్ లో ఉద్యోగాలు

Tirupati SVIMS Jobs : తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(SVIMS)లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. స్విమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులకు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 100 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు 50 నుంచి 58 సంవత్సరాలు వయోపరిమితి నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, బీసీలకు 5 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితి సడలించారు. జనరల్ అభ్యర్థులు దరఖాస్తుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్య్వూల ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. నవంబర్15వ తేదీలోపు ఆఫ్ లైన్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అయితే అభ్యర్థులు తమ దరఖాస్తులను The Registrar, Sri Venkateswara Institue of Medical Sceiences(SVIMS) Alipiri Road, Tiruapti, Tiruapti District-517507 అడ్రస్ కు పంపించాలని సూచించారు.

yearly horoscope entry point

ఖాళీలు

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు - 76
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు -20
  • ప్రొఫెసర్ పోస్టులు- 4

విద్యార్హతలు

  • అసిస్టెంట్ ప్రొఫెసర్లు - డీఎం/ఎం.సీహెచ్/డీఎన్.బి కోర్సుల్లో సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేట్ లేదా నిర్దేశిత సబ్జెక్ట్ లో డీఎం/ఎం.సీహెచ్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది.
  • అసోసియేట్ ప్రొఫెసర్లు - డీఎం/ఎం.సీహెచ్/డీఎన్.బి కోర్సుల్లో సూపర్ స్పెషాలిటీ పోస్టు గ్రాడ్యుయేట్ లేదా సంబంధిత సబ్జెక్ట్ లో డీఎం/ఎం.సీహెచ్ పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ చేయాల్సి ఉంటుంది.
  • ప్రొఫెసర్ - ఎండీ/ఎంస్/డీఎన్.బి లో సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

జీతాలు

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ - రూ.1,01,500- రూ.1,67,400
  • అసోసియేట్ ప్రొఫెసర్ - రూ.1,38,300-రూ.2,09,200
  • ప్రొఫెసర్ -రూ.1,48,200-రూ.2,11,400

Whats_app_banner