AP Summer Updates: ఏపీలో కొనసాగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు..జనం విలవిల-people are sweltering with summer temperatures and scorching sun in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Summer Updates: ఏపీలో కొనసాగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు..జనం విలవిల

AP Summer Updates: ఏపీలో కొనసాగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు..జనం విలవిల

HT Telugu Desk HT Telugu
May 18, 2023 06:05 AM IST

AP Summer Updates: ఆంధ్రప్రదేశ్‌లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

వేసవి తాపం తాళలేక మంచి నీరు తాగుతున్న యువకుడు
వేసవి తాపం తాళలేక మంచి నీరు తాగుతున్న యువకుడు (AFP)

AP Summer Updates: ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగభగలాడుతున్నాడు. ఉదయం 6 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

గురువారం మన్యం జిల్లా కొమరాడ, వైఎస్ఆర్ జిల్లా చాపాడు,వీరపనాయునిపల్లె, కమలాపురం, వల్లూరు,ముద్దనూరు, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మండల్లాలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎండ వేడి నేరుగా తాకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C - 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C - 42°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C - 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

బుధవారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 46°C, తిరుపతి జిల్లా ఏర్పేడులో 46°C, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా కడప, వీరపనాయునిపల్లె, వల్లూరు,ముద్దనూరు, మండల్లాలో తీవ్రవడగాల్పులు వీచాయి. మిగిలిన చోట్ల మొత్తం 38 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

IPL_Entry_Point