Operation Megha chakra : చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సిబిఐ దాడులు-operation megha chakra cbi raids on child pornograph ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Operation Megha Chakra : చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సిబిఐ దాడులు

Operation Megha chakra : చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సిబిఐ దాడులు

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 09:47 AM IST

Operation Megha chakra చిన్నారుల అశ్లీల చిత్రాలను వ్యాప్తి చేస్తోన్న సైబర్ నేరగాళ్లపై సిబిఐ దాడులు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 21రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో ఏకకాలంలో సిబిఐ సోదాలు జరిపింది.

చైల్డ్‌ పోర్నోగ్రపీపై దేశవ్యాప్తంగా సిబిఐ దాడులు
చైల్డ్‌ పోర్నోగ్రపీపై దేశవ్యాప్తంగా సిబిఐ దాడులు (HT_PRINT)

Operation Megha chakra చిన్నారులతో అశ్లీల చిత్రాలను తయారు చేసి వాటిని విక్రయిస్తున్న వారిపై సీబీఐ దాడులు జరిపింది. దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 59 స్థావరాల్లో సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో దాడులు జరిగాయి. చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్‌లో వారి అశ్లీల చిత్రాలు వ్యాప్తి చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సీబీఐ దేశవ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించింది.

Operation Megha chakra “ఆపరేషన్‌ మేఘచక్ర” పేరుతో 21 రాష్ట్రాల్లోని 59 స్థావరాల్లో సోదాలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. సింగపూర్‌లోని ఇంటర్‌పోల్‌ యూనిట్‌, న్యూజిలాండ్‌ పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ నిర్వహించింది. తెలంగాణలోని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, కృష్ణా జిల్లాలతో పాటు హరియాణా, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు, గోవా, రాజస్థాన్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, బిహార్‌, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోని నగరాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది.

Operation Megha chakra పిల్లల అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్‌ చేయడం, వాటిని వివిధ మార్గాల్లో షేర్‌ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసింది. నిందితుల ఐపీ అడ్రస్‌ల ఆధారంగా చిన్నారుల అశ్లీల చిత్రాల చలామణి రాకెట్‌లో భారతీయ పౌరుల పాత్ర ఉన్నట్లు విదేశాల నుంచి అందిన సమాచారం ఆధారంగా సీబీఐ ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం 2 కేసులు నమోదు చేసింది. అశ్లీల వెబ్‌సైట్‌లను బ్రౌజర్లలో వినియోగించ కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అక్రమ పద్ధతుల్లో వాటిని బ్రౌజ్ చేస్తున్నట్లు గుర్తించారు.

క్లౌడ్‌ ఆధారిత స్టోరేజ్‌ చిన్నారుల అశ్లీల చిత్రాలు షేర్‌ కాకుండా, డౌన్‌లోడ్‌, ట్రాన్స్‌మిషన్‌ చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాకెట్‌లో ఉన్న ఇతర నిందితులను గుర్తించి, వారి వద్ద ఉన్న చిత్రాలు ఇతరులకు చేరకుండా చర్యలు తీసుకొంది. సిబిఐ సోదాల సందర్భంగా 50 మంది అనుమానితుల నుంచి మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. . ఫోరెన్సిక్‌ పరికరాల ద్వారా వాటిని విశ్లేషించినప్పుడు అందులో భారీ మొత్తంలో చిన్నారుల అశ్లీల చిత్రాలున్నట్లు తేలింది. అదుపులోకి తీసుకున్న వారిని ప్రశ్నించి బాధిత చిన్నారుల సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆపరేషన్‌ 'మేఘ చక్ర'లో భాగంగా సీబీఐ శనివారం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సోదాలు జరిపింది. చిన్నారులపై లైంగిక వేధింపుల మెటీరియల్‌ పై నమోదైన రెండు కేసుల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న అశ్లీల వీడియోలున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచి వివరాలు తెలుసుకుని బాధితులు, బాధ్యులను గుర్తిస్తామని సిబిఐ ప్రకటించింది.

IPL_Entry_Point