Mother Anarchy: రెండో భర్తకు ఇద్దరు కూతుళ్లను అప్పగించిన కిరాతక తల్లి..-mother gave two daughters to her second husband for sexual abuse ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mother Anarchy: రెండో భర్తకు ఇద్దరు కూతుళ్లను అప్పగించిన కిరాతక తల్లి..

Mother Anarchy: రెండో భర్తకు ఇద్దరు కూతుళ్లను అప్పగించిన కిరాతక తల్లి..

HT Telugu Desk HT Telugu
Jul 14, 2023 09:19 AM IST

Mother Anarchy: వావి వరుసలు మరిచి, కన్నబిడ్డలనే విచక్షణ వదిలి సభ్య సమాజం తలదించుకునేలా ఓ తల్లి ప్రవర్తించింది. రెండో భర్తను స్వయంగా కుమార్తెలపై లైంగిక దాడికి ప్రోత్సహించింది. ఈ ఘోరం ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది.

కూతురు వరుసయ్యే యువతులపై అత్యాచారం
కూతురు వరుసయ్యే యువతులపై అత్యాచారం (HT_PRINT)

Mother Anarchy: రెండో భర్తకు మగ పిల్లలు కావాలనే కోరిక తీర్చడానికి ఏకంగా కన్నబిడ్డలను అతనికి అప్పగించిన దారుణ ఘటన ఏలూరులో జరిగింది. భర్త చనిపోయిన మహిళ, మేనత్త కుమారుడిని రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించడంతో కుమార్తెలను అతనికి అప్పగించింది.

మాతృత్వానికి మచ్చతెచ్చే ఈ హృదయ విదారక ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలోని గ్రామంలో జరిగింది. ఈ వ్యవమారంలో కన్నతల్లి అతి దారుణంగా ప్రవర్తించింది. వయసొచ్చిన ఇద్దరు కుమార్తెలను రెండో భర్త లైంగిక అవసరాలు తీర్చడానికి పంపింది.

అమానవీయమైన ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. బాధితులైన మైనర్‌ బాలికలు ఫిర్యాదు చేయడంతో దిశ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. నిందితురాలైన తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పెదపాడు మండలానికి చెందిన మహిళకు భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు పుట్టిన తర్వాత ఆమె కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. 2007లో భర్త అనారోగ్యంతో చనిపోయాడు.ఆ తర్వాత మేనత్త కొడుకును రెండోపెళ్లి చేసుకుంది.

పెళ్లైన కొన్నేళ్లకు తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని అతడు బెదిరింలు మొదలు పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత ఆమె కుమార్తెలు ఇద్దరు యుక్త వయసుకు వచ్చారు. వేరే పెళ్లి చేసుకో వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని రెండో భర్తను నిందితురాలు ఒప్పించింది.

ఈ క్రమంలో 2017లో ఆమె పెద్ద కుమార్తె 17ఏళ్ల వయసులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తర్వాత మగ పిల్లవాడి కోసం తన రెండో కూతురిని కూడా భర్తకు అప్పగించింది. ఏడాది క్రితం ఆమెకు మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ మృత దేహాన్ని కాలువలో పడేశారు.

భర్తతో విభేదాలు తలెత్తడంతో కూతుళ్లను గ్రామంలోనే వదిలేసి విశాఖలో పుట్టింటికి వెళ్లిపోయింది. బాధిత యువతుల్లో చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇటీవల ఇవన్నీ చెప్పడంతో, అతడు పిల్లల మేనమామకు తెలిపాడు. దీంతో బంధువులంతా కలిసి ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. దిశ స్టేషన్ సీఐ ఇంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నిందితులపై పోక్సో కేసు నమోదుచేశారు.నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Whats_app_banner