GPF Money : ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం.. ఎవరు తీశారో?-money withdraw from ap govt employees gpf accounts without knowing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gpf Money : ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం.. ఎవరు తీశారో?

GPF Money : ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం.. ఎవరు తీశారో?

HT Telugu Desk HT Telugu
Jun 28, 2022 07:12 PM IST

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి వేశారని ఉద్యోగులు చెబుతున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు విత్ డ్రా చేశారు. ఎవరు మా డబ్బులు తీసుకున్నారో తెలియడం లేదని ఉద్యోగులు అంటున్నారు. అయితే ప్రభుత్వమే విత్ డ్రా చేసి ఉంటుందని.. పలువురు ఉద్యోగులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుంచి మళ్లీ ఉద్యోగుల ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నట్టు మెసేజ్ లు వచ్చాయి.

తన ఖాతా నుంచి 83 వేల రూపాయలు తనకే తెలీకుండా విత్ డ్రా చేసేశారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కే.సూర్య నారాయణ చెబుతున్నారు. పీఆర్సీ, డీఏ అరియర్స్ జీపిఎఫ్ ఖాతాలకు జమ చేస్తానని తెలిపారు. గడచిన 6 నెలలుగా ఇచ్చిన డిఏ, అరియర్స్ ను మళ్ళీ వెనక్కు తీసుకున్నారన్నారు. మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాల నుంచి 800 కోట్ల వరకు వెనక్కు తీసుకున్నట్టుగా చెప్పారు.

'ఆర్థిక శాఖ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అధికారులు అందుబాటులో లేరు. ఈ తరహా ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేక ఉన్నతాధికారుల తప్పిదమా తెలియడం లేదు. ఉద్యోగుల సమ్మతి లేకుండా మా ఖాతాల నుంచి సొమ్ము ఎవరో విత్ డ్రా చేయడం నేరం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాం. మార్చి నెలలో జరిగిన లావాదేవీల ను అకౌంటెంట్ జనరల్ మాకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా తప్పిదమే. ఆర్థిక శాఖలోని సీఎఫ్ఎంఎస్ లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద మా వేతన ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉంది. ఇది ఎంత వరకు చట్టబద్ధం. దీనిపై లోతైన విచారణ జరగాలి.' అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అంటోంది.

గతంలో జమ చేసిన డీఏ బకాయిలను తిరిగి ప్రభుత్వం తీసేసుకుందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అంటున్నారు. రూ. 800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల నుంచి ప్రభుత్వం డ్రా చేసేసిందని ఆరోపిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల కోసం ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువైందని మండిపడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం డ్రా చేసేసిందంటున్నారు. అనుమతి లేకుండా నా ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది? అని ప్రశ్నించారు. తమ డబ్బులు తిరిగి ఖాతాల్లో జమ చేసినా.. కచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

WhatsApp channel

టాపిక్