TDP Consultants : టీడీపీకి గుడ్‌బై చెప్పేసిన సునీల్…. కాంగ్రెస్‌తో కంటిన్యూ..-mind share analytics consultant sunil kanugolu ends contract with tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Consultants : టీడీపీకి గుడ్‌బై చెప్పేసిన సునీల్…. కాంగ్రెస్‌తో కంటిన్యూ..

TDP Consultants : టీడీపీకి గుడ్‌బై చెప్పేసిన సునీల్…. కాంగ్రెస్‌తో కంటిన్యూ..

B.S.Chandra HT Telugu
Sep 20, 2022 09:38 AM IST

TDP Consultants తెలుగుదేశం పార్టీకి మైండ్‌ షేర్‌ అనలటిక్స్‌ సంస్థ గుడ్‌బై చెప్పేసింది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేకపోవడంతోనే సునీల్‌ కనుగోలు సంస్థ బయటకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాలనుకున్న ఆ పార్టీ ఒకటికి రెండు సంస్థల్ని కన్సల్టెంట్లుగా నియమించుకుంది. ఇది కాస్త వికటించి ఓ కంపెనీ బయటకు వెళ్లిపోయింది. ఇద్దరిలో ఎవరు కావాలో తేల్చుకోవాలని సునీల్ కనుగోలు టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు.

<p>చంద్రబాబుకు గుడ్‌బై చెప్పేసిన సునీల్ కనుగోలు</p>
చంద్రబాబుకు గుడ్‌బై చెప్పేసిన సునీల్ కనుగోలు (HT_PRINT)

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సలహాలిచ్చే వ్యూహకర్తలు ఎక్కువైపోయారని ఆ మధ్య పార్టీ నేతలు సెటైర్లు వేసుకున్నారు. అంతా అనుకున్నట్లే ఆ గొడవలో ఓ కంపెనీ బయటకు వచ్చేసింది. పార్టీకి జవసత్వాలు కల్పించడానికి ఒకరికి ఇద్దరు కన్సల్టెంట్లను నియమించుకోవడంతో చంద్రబాబు ఎవరి TDP Consultants మాట వింటున్నారో తెలీక ఆ పార్టీ నేతలు జుట్లు పీక్కుంటున్నారని కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. పార్టీని బలోపేతం చేసే విషయంలో రెండు సంస్థల మధ్య నేతలు సతమతమైపోతున్నారని కొన్ని నెలలుగా టీడీపీలో విస్తృత చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా ఓ సంస్థ టీడీపీకి గుడ్‌బై చెప్పేసింది.

yearly horoscope entry point

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు TDP Consultantsఒకరికి ఇద్దరు వ్యూహకర్తల్ని నియమించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆస్థానంలో ఉన్న ఇద్దరు వ్యూహకర్తలకు ఒకరంటే ఒకరికి పడకపోవడం రచ్చకు కారణమైంది. కన్సల్టెన్సీ కంపెనీల వ్యాపారమైన పోటీ కాస్త వైరానికి దారి తీయడంతో ఎవరికి వారు చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో పార్టీలో గందరగోళానికి కారణమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీకి పునరుత్తేజం కల్పించడానికి TDP Consultants రాబిన్‌ శర్మను కన్సల్టెంట్‌గా నియమించుకుంది. షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట రాజకీయ వ్యూహకర్తగా రాబిన్‌ శర్మ టీడీపీకి సేవలు అందిస్తున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో పనిచేసిన రాబిన్‌ శర్మ సొంత కుంపటి పెట్టుకుని చంద్రబాబును క్లయింట్‌గా మార్చుకున్నాడు. రాబిన్‌ శర్మ ఏమి చెప్పారో, చంద్రబాబుకు ఏమి నచ్చిందో కానీ రెండున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌కు సునీల్ కనుగోలు కన్సల్టెంట్‌గా నియమితులయ్యారు.సునీల్‌ గతంలో శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలకు సేవలందించారు. రాబిన్‌ శర్మ సేవలు అందిస్తుండగానే సునీల్ బృందం కూడా టీడీపీకి సేవలు అందించడం ప్రారంభించింది. పీకే టీం నుంచి వేరుపడిన రాబిన్‌, సునీల్‌ ఇద్దరు చంద్రబాబుకు రాజకీయ వ్యూహాలు, లెక్కలు నేర్పిస్తున్నారు.

పోటీతోనే తిప్పలు…

నిజానికి వీరిద్దరికి TDP Consultants అంత సఖ్యత లేదనే సంగతి బయట కన్సల్టెంట్లలో విస్తృత ప్రచారంలో ఉంది. రాజకీయ వ్యూహం అనేది ఫక్తు వ్యాపారం కావడంతో ఒకరి క్లయింట్‌ వ్యాపారంలోకి మరొకరు ప్రవేశించడాన్ని సహించలేకపోతున్నారు. ఇప్పుడు ఒకే వ్యాపారంలో ఉన్న ఇద్దరు వ్యూహకర్తలు చంద్రబాబు దగ్గరే ఉండటంతో బాబు ఎవరి మాట వింటున్నారనే సందేహం నేతల్ని పట్టి పీడిస్తోంది. షో టైమ్ రాబిన్ శర్మ, మైండ్ షేర్ అనలటిక్స్‌ సునీల్ కనుగోలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం కోసం ప్రయత్నిస్తూనే ఒకరిపై ఒకరు పైచేయి కోసం ప్రయత్నించారు. ఈ పోరాటంతో విసిగిపోయిన సునీల్ గత వారం టీడీపీకి గుడ్‌బై చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఒకే సమయంలో రెండు TDP Consultants సంస్థలు టీడీపీకి సేవలు అందించడం సరికాదనే ఉద్దేశంతో టీడీపీని వీడినట్లు చెబుతున్నారు. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నందున ఇప్పుడే తప్పుకోవడం మంచిదని సునీల్ కనుగోలు భావించారు. ఎవరి సేవలు కావాలో ఇప్పుడే తేల్చుకోవాలని చంద్రబాబుకు తేల్చి చెప్పేశారట. నాలుగైదు నెలలు పరిస్థితిని సమీక్షించాక టీడీపీకి నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి మైండ్ షేర్‌ అనలిటిక్స్‌ సంస్థ ఇప్పుడు తప్పుకుందని చెబుతున్నారు.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన సునీల్ అమెరికాలో చదువుకుని కొన్నాళ్లు ఐపాక్‌లో పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రిలియంట్ మైండ్స్‌ పేరుతో కన్సల్టెంట్‌గా పనిచేశారు. బీజేపీ గెలుపు వెనుక ఈ సంస్థ పాత్ర కూడా గణనీయంగా ఉంది. తమిళనాడులో స్టాలిన్‌కు, కొన్నాళ్లు ఏఐడిఎంకెకు, బీహార్‌లో నితీష్‌కు పనిచేసిన అనుభవం ఉన్నా, సక్సెస్‌ రేటు మాత్రం పెద్దగా లేదు. డేటా అనాలసిస్, వ్యూహరచన, బూత్‌లెవల్ పోల్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కూడా సునీల్ సేవలు అందిస్తున్నారు.

అయితే చంద్రబాబు నియమించుకున్న ఇద్దరు వ్యూహకర్తలు అసలు ఆయనకు ఏమి చెబుతున్నారో తెలీక సీనియర్లు గందరగోళానికి గురవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అభ్యర్ధుల ఎంపిక వెనుక ఫీడ్‌ బ్యాక్‌ అందించే విషయంలో స్ట్రాటజిస్ట్‌ల పైనే బాబు ఆధారపడుతున్నారని అవి సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదని ప్రచారం ఉంది. ఇప్పుడు ఇద్దరు కన్సల్టెంట్ల మధ్య విభేదాలతో ఒకరు టీడీపీను వీడి బయటకు వెళ్లిపోవడంతో టీడీపీ పరిస్థితి మెరుగవుతుందో లేదో చూడాలి.

Whats_app_banner