NBK107| త్వరలో పట్టాలెక్కనున్న బాలయ్య చిత్రం-gopichnad malineni and balakrishna movie shoot will start soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nbk107| త్వరలో పట్టాలెక్కనున్న బాలయ్య చిత్రం

NBK107| త్వరలో పట్టాలెక్కనున్న బాలయ్య చిత్రం

HT Telugu Desk HT Telugu
Feb 09, 2022 06:15 AM IST

గోపిచంద్ మలినేనితో ఓ చిత్రం చేయడానికి బాలయ్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నెలలోనే చిత్రీకరణను మొదలెట్టేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి.

<p>బాలయ్య 107వ చిత్రం&nbsp;</p>
బాలయ్య 107వ చిత్రం (Twitter)

Htఅఖండ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. అంతేకాకుండా ఓటీటీ వేదికగా ప్రసారమైన అన్‌స్టాపబుల్ షో విజయంతో మరింత జోరు మీదున్నారు. ఓ పక్క రాజకీయాల్లో భాగమవుతూనే మరోవైపు సినిమాలపైనా దృష్టిసారించారు. గోపిచంద్ మలినేనితో ఓ చిత్రం చేయడానికి బాలయ్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నెలలోనే చిత్రీకరణను మొదలెట్టేందుకు సన్నహాలు ప్రారంభమయ్యాయి. NBK107 పేరుతో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

yearly horoscope entry point

సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 16 నుంచి ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ కనిపించబోతుంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఎక్కువగా విదేశాల్లోనే చిత్రీకరించున్నారని, తొలి సన్నివేశాలను మాత్రం తెలంగాణలోని సిరిసిల్లలో తీస్తారని సమాచారం.

క్రాక్ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత గోపిచంద్ మలినేని..బాలకృష్ణతో సినిమా రూపొందిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అఖండలో ఓ ఊపు ఊపిన బాలయ్య.. ఈ సినిమాలో మరో సారి శక్తిమంతమైన పాత్రలో కనిపించాలని కోరుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనలతో ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ నటిస్తోన్న 107వ చిత్రం.

Whats_app_banner

సంబంధిత కథనం