Chandrababu : నన్ను, లోకేశ్​ను చంపాలని చూస్తున్నారు-chandrababu sensational comments on cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : నన్ను, లోకేశ్​ను చంపాలని చూస్తున్నారు

Chandrababu : నన్ను, లోకేశ్​ను చంపాలని చూస్తున్నారు

HT Telugu Desk HT Telugu
Nov 30, 2022 05:48 PM IST

Chandrababu Comments On CM Jagan : వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయడం, ముఖ్యమంత్రికి చెంపదెబ్బ లాంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వివేకా తీర్పుపై జగన్​ సమాధానం చెప్పాలని, లేదంటే.. సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.

సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్
సీఎం జగన్ పై చంద్రబాబు కామెంట్స్

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చంద్రబాబు(Chandrababu) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ(YCP)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్​కి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని చంద్రబాబ ప్రశ్నించారు. బాబాయిని చంపిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించటం, ఇదేం ఖర్మ అని చంద్రబాబు విమర్శించారు. బాబాయ్​ని చంపినంత సులువుగా తనను చంపొచ్చని, ఇప్పుడు లోకేశ్​ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ చేసే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

'జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి అవకాశం. బాబాయిని చంపి అబద్ధాలు అల్లిన జగన్​కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. వైసీపీ గెలిస్తే మనకు రాజధాని అమరావతి(Capital Amaravati) ఉండదు. వివేకా హత్య కేసు(Viveka Murder Case) విచారణ తెలంగాణకు బదిలీ కావటం, జగన్ రెడ్డికి గట్టి చెంపదెబ్బ. తండ్రి హత్య కేసుపై సుప్రీంకోర్టు(Supreme Court) వరకు సునీత చేసిన పోరాటాన్ని అంతా అభినందించాలి. తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని సునీత పోరాడుతున్నారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసి.. ఇప్పుడు బెదిరిస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.

తన బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమేనని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు నెల(Polavaram Project) వద్దకు వెళ్లి.. పనులను పరుగులు పెట్టించానని చెప్పారు. టీడీపీ(TDP) హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక..రివర్స్ టెండర్ తీసుకొచ్చారన్నారు. మూడు సంవత్సరాలో 72 శాతం పూర్తయితే.. జగన్ వచ్చాక.. మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్ కూడా బాగు చేయలేదని విమర్శించారు. నిర్వాసితులకు ఆదుకోలేదన్నారు. పోలవరం కేంద్రం ప్రాజెక్టు అని, నిర్మాణానికి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుందన్నారు.

'వైసీపీ గెలిస్తే పోలవరం(Polavaram) ముంచేస్తారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పాను. ముద్దులు పెడితే మోసపోవద్దు. పిడిగుద్దులు ఉంటాయని ఎప్పుడో అన్నాను. ప్రజల్లో చైతన్యం కోసమే ఇదేం ఖర్మ(Idhem Kharma) మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాం. మీలో చైతన్యం వచ్చి ధైర్యంగా ముందుకు రావాలి. ఏపీ రైతుల నెత్తిలో రూ.2.7 లక్షల తలసరి అప్పు ఉంది. మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు వేస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.

IPL_Entry_Point