తెలుగు న్యూస్ / ఫోటో /
AP Heat Wave : ఏపీ ప్రజలకు అలర్ట్, రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాల్పులు- 154 మండలాల్లో వడగాల్పులు
- AP Heat Wave : ఏపీలో రేపు, ఎల్లుండి తీవ్రగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- AP Heat Wave : ఏపీలో రేపు, ఎల్లుండి తీవ్రగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
(1 / 6)
ఏపీలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో నిప్పులు కొలిమిలా వేడి ఉంటుంది. ఉక్కపోత, వేడగాల్పులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
(2 / 6)
ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
(3 / 6)
రేపు(ఏప్రిల్ 25) రాష్ట్రంలో 54 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 154 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
(4 / 6)
ఎల్లుండి(ఏప్రిల్ 26న) రాష్ట్రంలోని 36 మండలాల్లో తీవ్రవడగాల్పులు,157 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
(5 / 6)
ఈరోజు 69 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 105 మండలాల్లో వడగాల్పులు వీచాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయాల్లో బయటకు వెళ్లవద్దని సూచించింది.
ఇతర గ్యాలరీలు