AP Anganwadi Jobs : 560 అంగన్వాడీ ఉద్యోగాలు... భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్-ap high court green signal to fill the posts of anganwadi supervisor jobs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Anganwadi Jobs : 560 అంగన్వాడీ ఉద్యోగాలు... భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

AP Anganwadi Jobs : 560 అంగన్వాడీ ఉద్యోగాలు... భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu
Nov 24, 2022 11:54 AM IST

ap hc on anganwadi jobs 2022: రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ
ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ (aphc)

Anganwadi Supervisor Jobs in AP: అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ.. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు... గతంలో స్టే ఇచ్చింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేస్తింది. నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫలితంగా 560 ఉద్యోగాల భర్తీ కానున్నాయి.

రాష్ట్రంలో 55,607 అంగన్‌ వాడీలు Anganvadi jobsఉండగా, 25 అంగన్‌ వాడీ కేంద్రాలకు ఒక సూపర్‌ వైజర్‌ ఉండాల్సి ఉండగా, ఎక్కువ సూపర్‌ వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల, ఒక్కొక్క సూపర్‌ వైజర్‌ 60 అంగన్‌ వాడీ కేంద్రాల వరకూ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగానున్న 560 అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేన్‌ జారీచేసి భర్తీ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 21,098 అంగన్‌ వాడీ వర్కర్లు, 82 కాంట్రాక్టు సూపర్‌ వైజర్లు పోస్టులకు పరీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా అంగన్‌ వాడీల్లో పి.పి.–1 మరియు పి.పి.–2 విధానం అమలు పర్చడం వల్ల పిల్లలకు ఇంగ్లీషును నేర్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా అంగన్‌ వాడీ పిల్లలకు ఇంగ్లీషు రైమ్స్, పధాలు , సెంటెన్సులు చెప్పాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల స్పోకెన్‌ ఇంగ్లీషు నైపుణ్యతను పెంచేందుకు వ్రాత పరీక్షతతో పాటు వారికి స్పోకెన్‌ ఇంగ్లీషు పరీక్ష కూడా నిర్వహించేందుకు సిద్ధమైంది. అభ్యర్థుల ఇంగ్లీషు నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ఇంటర్యూలు నిర్వహిస్తే అభ్యర్థులకు కష్టంగా ఉంటుందనే అలోచనతో 3–5 నిమిషాలు వీడియోను రికార్డు చేసుకొని అప్‌ లోడ్‌ చేయాల్సినదిగా నోటిఫికేషన్లో పొందుపరిచారు. 45 మార్కులతో కూడిన మల్టిపుల్‌ ఛాయిస్‌ వ్రాతపరీక్ష తెలుగులో నిర్వహించగా, మరో ఐదు మార్కులు స్పోకెన్‌ ఇంగ్లీషు నైపుణ్యానికి కేటాయించారు. ఓ.ఎం.ఆర్‌. షీట్‌ లో గుర్తించబడిన సమాధానాలను కంప్యూటర్‌ స్కానర్‌ ద్వారా మార్కులను ఖరారు చేయనున్నారు.

ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియపై కొందరు అభ్యర్థులు పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. స్పోకెన్‌ ఇంగ్లీషు ప్రక్రియ ప్రారంభించక ముందే వ్రాత పరీక్ష కీ ఎందుకు వెల్లడి చేయలేదని, మార్కులు ప్రకటించకపోవటాన్ని సవాల్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం మద్యంతర ఉత్తర్వులను జారీ చేయగా.. ఫలితాలను విడుదల చేయకుండా ఆపివేశారు. తాజాగా కోర్టు స్టే ఎత్తివేసిన నేపథ్యంలో... నియామక ప్రక్రియ ముందుకు సాగనుంది.

IPL_Entry_Point