పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు చర్యలు-5 year old girl raped in andhra pradesh palnadu police start search operation to nab 18 year old accused ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు చర్యలు

పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు చర్యలు

HT Telugu Desk HT Telugu
Jun 25, 2024 07:23 AM IST

ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఐదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం
పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

పల్నాడు: పల్నాడు పట్టణంలో ఐదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సోమవారం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నిందితుడిని చందుగా గుర్తించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని నరసరావుపేట రూరల్ ఎస్ఐ రోశయ్య తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (ఏఎన్ఐ)

WhatsApp channel