Balapur Ganesh Laddu: గతేడాది రికార్డు బ్రేక్.. భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డు-the most famous balapur laddu was bid for a record rs 27 lakh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Balapur Ganesh Laddu: గతేడాది రికార్డు బ్రేక్.. భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డు

Balapur Ganesh Laddu: గతేడాది రికార్డు బ్రేక్.. భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డు

Sep 28, 2023 01:55 PM IST Muvva Krishnama Naidu
Sep 28, 2023 01:55 PM IST

  • భాగ్యనగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డు వేలం ప్రక్రియ పూర్తయింది.ఈ సారి వేలంలో మొత్తం 36 మంది పాల్గొన్నారు. లడ్డు ప్రారంభం నుంచి పోటాపోటీగా వేలం ప్రక్రియ కొనసాగింది. చివరకు దాసరి దయానంద రెడ్డి రూ. 27 లక్షలకు లడ్డును సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది లడ్డూ రూ. 24.60లక్షలు పలికింది. ఇక బాలపూర్ లడ్డు వేలాన్ని ఓ రేంజ్‌లో బండ్లగూడ జాగీర్ కీర్తి రీచ్ విల్లా గణపతి బ్రేక్ చేసింది. ఏకంగా కీర్తి రిచ్ విల్లా గణపతి లడ్డు కోటి 20 లక్షల రూపాయలు పలికింది. వేలం పాటలో లడ్డును అసోసియేషన్ ప్రతినిధులు కైవసం చేసుకున్నారు.

More