Telangana: మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం ఆరంభమైంది. బుధవారం నుంచి 4 రోజులపాటు మహాజాతర జరగనుండగా.. మొదటిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనున్నారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును పెనుక వంశస్థులు పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా తమ ఇళ్లను పుట్టమట్టితో అలికి ముగ్గులు వేశారు. ఆ తరువాత గిరిజన సంప్రదాయ పద్ధతిలో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.