Rahul Gandi at Tukkuguda | ఆదానీల వైపు మోదీ.. దళితులు, పేదల వైపు కాంగ్రెస్ పార్టీ
- తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీది ఒక్కటే బంధమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ కనుసైగ చేయగానే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని గుర్తు చేశారు. అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణకు 6 హామీలు ఇస్తున్నామని చెప్పారు.