కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటి అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు ఆ తేదిని వెల్లడించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం వెళ్లి వనదేవతల్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను ఫిబ్రవరి 27న సాయంత్రం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ హాజరవుతారని చెప్పారు. అంతేకాకుండా తర్వలో రైతులకు రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పారు. దీనిపై బ్యాంకర్లతో మాట్లాడతున్నట్లు వెల్లడించారు.