BJP MLA Raja Singh arrest బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?-bjp mla arrested over prophet insult after massive protest in hyderabad who is t raja singh ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bjp Mla Raja Singh Arrest బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

BJP MLA Raja Singh arrest బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?

Aug 23, 2022 04:19 PM IST HT Telugu Desk
Aug 23, 2022 04:19 PM IST

 హైద‌రాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొహమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి, మ‌త విశ్వాసాల‌ను అవమానించిన నేరానికి ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ మాజీ నేత నుపుర్ శ‌ర్మ మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై చేసిన వ్యాఖ్య‌ల వేడి చ‌ల్లార‌క ముందే.. అవే కామెంట్ల‌ను రిపీట్ చేసి రాజాసింగ్ మ‌రో వివాదానికి కేంద్ర బిందువ‌య్యారు. స్టాండ్ అప్ క‌మేడియ‌న్ మునావ‌ర్ ఫారూఖీ హిందూ దేవ‌త‌ల‌ను హేళ‌న చేస్తున్న‌ట్లే.. తాను కూడా మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై కామెడీగా వీడియో చేశానని చెబుతూ.. ఒక 10 నిమిషాల వీడియోను రాజాసింగ్ విడుద‌ల చేశారు. అందులో మొహ‌మ్మ‌ద్ ప్ర‌వక్త‌పై అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. సోమ‌వారం ముస్లింలు హైద‌రాబాద్‌లో భారీ నిర‌స‌న‌లు చేప‌ట్టారు. రాజా సింగ్‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. దాంతో, ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కూడా ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. పూర్తి వివ‌రాలు ఈ వీడియోలో చూడండి..

More