Chandrayaan-3 | చంద్రుడిపై వెలుగులు.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రలేస్తాయా..?
- భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో నెల రోజుల క్రితం జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి నుంచి కీలక సమాచారాన్ని భూమికి చేర్చాయి. 12 రోజులపాటు నిర్విరామంగా పరిశోధనలు చేసి, ఆ తర్వాత అక్కడ రాత్రి ప్రారంభం కావడంతో నిద్రావస్తలోకి వెళ్లిపోయాయి. అయితే ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ వెలుగు రేఖలు విచ్చుకోనున్న వేళ.. యావత్ ప్రపంచం దృష్టి ఇస్రో వైపు ఉంది. గత 14 రోజులుగా అక్కడి మైనస్ 180 డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంది. అందుకే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొపేలా అన్ని చర్యలు ఇస్రో తీసుకోనుంది. ఈ ప్రయత్నం ఫలిస్తే మరో 14 రోజులపాటు జాబిల్లి రహస్యాలు భూమికి చేరుతూనే ఉంటాయి.