Rajasthan: రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో భారతదేశం తన సైన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. పోఖ్రాన్‌లో జరిగిన భారత్ శక్తి కార్యక్రమంలో మన దేశానికి చెందిన సైనిక విమానాలు, అత్యాధునిక లాంచర్ వెహికల్స్ పోరాట పటిమను ప్రదర్శించాయి. చూపరులను ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన ఘటనకు ప్రధాని నరేంద్ర మోదీ, 30 దేశాలకు చెందిన ప్రముఖులు స్వయంగా వీక్షించారు.