పేద, మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.