అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని నేపాలీలు సంబురాలు జరుపుకున్నారు. జనక్‌పూర్‌లో 2.5 లక్షల మట్టి దీపాలను వెలిగించారు. నిజానికి నేపాల్‌లోని జనక్‌పూర్ ను సీత స్వస్థలంగా భావిస్తారు. సోమవారం రాముడి 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భరంగా వెలిగిన ఈ దీపాలు రంగురంగుల అలంకరణలతో మెరిశాయి.