Viral Video: రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. ఆగిపోయిన పర్యాటకులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే..?-an elephant attacked a tourists vehicle video goes viral ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. ఆగిపోయిన పర్యాటకులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Viral Video: రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. ఆగిపోయిన పర్యాటకులు, ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Published Oct 05, 2023 03:12 PM IST Muvva Krishnama Naidu
Published Oct 05, 2023 03:12 PM IST

  • సెలవులు వచ్చాయంటే చాలు పర్యాటకులు ఏదో ఒక ప్రాంతానికి వెళ్తుంటారు. కొందరు బృందంగాను మరికొందరు సింగిల్ గా వెళ్తుంటారు. అలానే ఓ వాహనంలో కొందరు కలిసి బృందంగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లారు. ఇలా వెళ్లిన పర్యాటకులకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఓ అడవి మార్గంలో వెళ్తుండగా, అడ్డంగా ఏనుగు వచ్చింది. దీంతో కాసేపు ఆ వాహనాన్ని రోడ్డపై నిలబెట్టారు. రోడ్డు నుంచి ఏనుగు కదులుతున్న క్రమంలో వాహనాన్ని కదిలించారు. ఈ క్రమంలోనే వాహనం వద్దకు వచ్చి, డ్రైవర్ సీటులో నుంచి తొండం వాహనం లోపలికి పెట్టింది ఏనుగు. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు తొండాన్ని అటు ఇటు కదిలించిన ఏనుగు, వాహనంలో ఉన్న పండ్లను తీసుకొని వెళ్లిపోయింది. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియోని చూస్తే, పర్యాటకులు తమిళనాడు, లేదా కర్ణాటకకు చెందిన వారిగా ఉన్నారు.

More