AP Police: మద్యం మత్తులో సముద్రంలోకి పరుగెత్తిన యువకులు... కాపాడిన పోలీసులు-police personnel saved people who were drowning in the sea after drinking alcohol ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap Police: మద్యం మత్తులో సముద్రంలోకి పరుగెత్తిన యువకులు... కాపాడిన పోలీసులు

AP Police: మద్యం మత్తులో సముద్రంలోకి పరుగెత్తిన యువకులు... కాపాడిన పోలీసులు

Published Aug 14, 2023 12:22 PM IST Muvva Krishnama Naidu
Published Aug 14, 2023 12:22 PM IST

  • బాపట్ల జిల్లాలో ఉన్న సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరిని మెరైన్ పోలీసులు రక్షించారు. ఆదివారం కావడంతో వాడరేవు, రామాపురం తీరంలో పర్యాటకులు సముద్ర స్నానానికి వచ్చారు. ఇంతలో ఓ రిసార్టు సమీపంలో కొందరు సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. కర్నూలుకు చెందిన మహేష్‌, రమణలు మద్యం మత్తులో స్నానం చేస్తుండగా అలల తాకిడికి మునిగిపోతూ పెద్దగా కేకలు వేశారు. వెంటనే గమనించిన మెరైన్‌ పోలీసులు సాహసం చేసి వారిని కాపాడారు. సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు. పోలీసుల తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు.

More